Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : ఉద్యమ గళం మూగబోయింది

Venkat Reddy On Bandi Sanja

Venkat Reddy On Bandi Sanja

ప్రజా గాయకుడు గద్దర్‌ ఈ రోజు కన్నుమూశారు. గద్దర్‌ చనిపోయినట్లు కొడుకు సూర్యం తెలిపారు. ఇవాళ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్‌ తుదిశ్వాస విడిచారు. అయితే.. ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమ గళం మూగబోయిందని, ప్రజా యుద్ధనౌక గద్దర్ గారు కన్నుమూశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో నాకు మంచి అనుబంధం ఏర్పడిందని, నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి అని ఆయన వెల్లడించారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరు అని, ప్రజా సమస్యలపై ఆయన పోరాటం అజరామరం అని అన్నారు. తనదైన పాటలతో ఎంతోమందిని ఉత్తేజ పరిచారు గద్దర్ అని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. అనేక పాటలతో ఆనాడు ఉద్యమానికి ఊపు తెచ్చారని, తెలంగాణ ఉద్యమ గళం అయిన గద్దర్ స్మృతిలో.. ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Also Read : CM Jagan: ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి

అయితే.. గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

Also Read : CM KCR : జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు

Exit mobile version