Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : సీఎం అడగకుండా కేంద్రం నిధులు ఎలా ఇస్తుంది

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

అడగకుండా అమ్మా కూడా అన్నం పెట్టదు.. అలాంటప్పుడు సీఎం అడగకుండా కేంద్రం నిధులు ఎలా ఇస్తుందని నల్లగొండ జిల్లా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కొట్లాటలు, విభేదాలు ఉన్నా ముఖ్యమంత్రిగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ప్రధానిని కలసి రాష్ట్రానికి ఏం కావాలో అడిగి సాధించుకోవాల్సి ఉండే అని ఆయన హితవు పలికారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌‌లు.. వారి వారి రాష్ట్రాలకు మోదీ వచ్చినప్పుడు స్వాగతం పలకడం లేదా? అని ప్రశ్నించారు.

Also Read : RR vs DC: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. ఢిల్లీకి భారీ లక్ష్యం

ప్రధానిని కలవడానికి మహమ్మద్ అలీ, తలసాని వెళ్తే వారిని ఎవరు పట్టించుకుంటారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ప్రధాన మంత్రి హోదాలో సీఎం కేసీఆర్ కు ఏడు నిమిషాల టైం ఇచ్చారు… ఆ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన 70 సమస్యలను ప్రస్తావించవచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా.. సమస్యలు ప్రస్తావిస్తే ఎవరైనా అడ్డుపడతారా అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని ఉన్న వేదికపై నుండి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. అన్యాయం చేస్తున్నారని సీఎం ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు.నేను ప్రధానిని పలుమార్లు కలిసి సమస్యలు ప్రస్తావించి నిధులు తెచ్చుకున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Also Read : Arman Malik: అల్లు అర్జున్ కి పాడేసాను… మహేష్ బాబుకి బాలన్స్ ఉంది…

Exit mobile version