రేవంత్ రెడ్డి వ్యవహారంలో నేను చేసిన విమర్శలను ఆనాడు ఎవరు పట్టించుకోలేదని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికైనా కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీలోకి రావాలని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడిందని అన్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రజా సమస్యల కోసం కోసం పోరాడిన చరిత్ర…. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డికి లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దేశం, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పై నేను విమర్శలు చేస్తే మునుగోడు వేదికగా కాంగ్రెస్ సీనియర్లు నాపై దమ్ము ఎత్తిపోసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా కాంగ్రెస్ సీనియర్లు కాంగ్రెస్ను వీడి బీజేపీ చేరాలని, బహిరంగంగా ఆహ్వానిస్తున్నానని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read : Vijayasai Reddy: ‘రాష్ట్రానికే ఖర్మ’ అంటూ.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజం
ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలు రగిల్చిన చిచ్చు పతాకస్థాయికి చేరకుంది. సీనియర్లలలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై చర్చించారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వంటి నేతలు హాజరై తాజా పరిస్థితులపై చర్చించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేసిన వలస వచ్చినవారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాపాడుతున్న తమపై కోవర్టులంటూ సోషల్ మీడియాలో ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.