NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: అసెంబ్లీలో జగదీష్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం..

Komatireddy

Komatireddy

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజమంత్రి జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం అని కోమటిరెడ్డి చెప్పారు. ఏ సబ్ స్టేషన్ అయినా పోదాం.. 8 నుంచి 12 గంటల కరెంట్ ఇచ్చినట్టు లాక్ బుక్ లో ఉంది.. మేము చెక్ చేసిన తర్వాత లాక్ బుక్ లేకుండా చేశారు వాళ్ళు.. 24 గంల కరెంట్ ఇస్తే లాక్ బుక్ ఎందుకు తీసేశారు అని ఆయన ప్రశ్నించారు. పిక్ అవర్ లో 16 గంటలు ఇచ్చారు.. కరెంట్ వస్తుందో లేదో తీగలు పట్టుకోండి గతంలో కేటీఆర్ అన్నారు.. సిరిసిల్లలోనే పెట్టుకుందాం అంటే కాంగ్రెస్ వాళ్లు పట్టుకోండి దరిద్రం పోతుంది అన్నారు కేటీఆర్.. ఈ విద్యుత్ రంగం నుంచి జగదీష్ రెడ్డికి 10 వేల కోట్ల రూపాయలు తిన్నాడు.. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు కూడా వాటా ఉంది.. టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారు.. ఫ్రీ కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ ది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

Read Also: CM Revanth: ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందే..

బీఆర్ఎస్ కు ప్రభాకర్ రావు దోచి పెట్టాడు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్లు వచ్చి ఏదేదో చెప్తున్నారు.. తిన్నది అంతా కక్కిస్తాం.. ఎవరిని వదిలేదు.. దొంగలు అనగానే బీఆర్ఎస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారు.. సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.. 24 గంటలు కరెంట్ అనేది మభ్య పెట్టడమే.. లాక్ బుక్ బయట పెట్టండి అని ఆయన ప్రశ్నించారు. ఎవరు ఎంత తిన్నారో అంతా కక్కిస్తాం.. సీఎంని విచారణ చేయాలని కోరుతున్నామని కోమటిరెడ్డి అన్నారు.

Read Also: Bigg Boss : భార్యాభర్తల మధ్య ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్.. విడాకులు తీసుకోబోతున్న భార్యాభర్తలు?

ఇక, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్ ఎటాక్ కు దిగారు. విద్యుత్ శాఖలో అవినీతి జరిగితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని జగదీష్ రెడ్డి కోరారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలు విచారణ జరిపించాలి.. దోషులకు శిక్ష పడాలి.. ఒక వేళ తప్పు చేసినట్లు ఆరోపణలు నిజం అయతే వారికి శిక్ష పడాలి.. పనికి మాలిన మాటలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డివి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవ శ్వేత పత్రం విడుదల చేశారు.. మంత్రులు అందరూ కలిసి మాట్లాడి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారో చెప్పండి.. ఒక్క రోజు అయిన గతంలో విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ప్ల కార్డులు పట్టుకునే అవకాశం వచ్చిందా?.. అప్పుల అందరికీ ఉన్నాయి.. ఆస్తులు కూడా ఉన్నాయి.. అప్పులు ఉన్నాయంటే తప్పు చేసినట్టే నా?.. చేసిన అప్పుతోనే అభివృద్ధి చేశామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.