Site icon NTV Telugu

Pooja-Sreeleela: కోలీవుడ్‌లో పూజా–శ్రీలీల కెరీర్‌కు గట్టి పరీక్ష..

Pooja Hegde Areelila

Pooja Hegde Areelila

ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ప్రతి సినిమా పరిక్షలాంటిదే. ఎందుకంటే కంటిన్యూగా రెండు ఫ్లాప్‌లు పడ్డయంటే దర్శకనిర్మాతలు వారిని పక్కప పెట్టేస్తారు. అదృష్టం.. ఫేమ్‌ని బటి అవకాశాలు వచ్చిన హిట్ దక్కకోతే మాత్రం కష్టం. ప్రజెంట్ ఇప్పుడు శ్రీ లీల, పూజా హెగ్డే అదే పరిస్థితిలో ఉన్నారు. టాలీవుడ్ గ్లామర్ డాల్స్ పూజా హెగ్డే, శ్రీలీలకు ప్రస్తుతం అవకాశాలకైతే కొదవ లేదు కానీ, బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ తగిలి చాలా కాలమైంది.

Also Read : MSVG : మన శంకర వర ప్రసాద్ గారు.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ షురూ!

ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్‌ను ఏలిన ఈ ముద్దుగుమ్మలు, ఇప్పుడు తమ క్రేజ్‌ను మళ్లీ టాప్‌కు తీసుకెళ్లే ఒక్క సాలిడ్ బ్రేక్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఆశలు కోలీవుడ్‌పైనే ఉన్నాయి. బుట్ట బొమ్మ పూజా హెగ్డే, దళపతి విజయ్ సరసన నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉంది. విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, ఈ మూవీలో తన నటనతో మెప్పించి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోవాలని పూజా భావిస్తోంది.

అలాగే మరోవైపు యంగ్ నటి శ్రీ లీల ‘పరాశక్తి’ సినిమాతో తమిళ తంబీల అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, సాంగ్స్‌లో శ్రీలీల ఎనర్జీ చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. కేవలం డాన్సులకే పరిమితం కాకుండా, ఒక పవర్ ఫుల్ రోల్‌తో తనలోని నటిని నిరూపించుకోవాలని ఆమె తపత్రయ పడుతోంది. కోలీవుడ్‌లో పోటీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో, ఈ పండుగ సీజన్ ఈ ఇద్దరు భామలకు ‘డూ ఆర్ డై’ లాంటిదేనని చెప్పాలి. మరి ఈ సుందరీమణులకు తమిళనాట అదృష్టం వరించి మళ్లీ ఫామ్‌లోకి వస్తారో లేదో చూడాలి.

Exit mobile version