Site icon NTV Telugu

Retro: సితార చేతికి సూర్య నటించిన ‘రెట్రో’ పగ్గాలు..

Retro

Retro

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్‌ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. గతేడాది క్రిస్మస్‌ సందర్భంగా టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సూర్య, కార్తీక్‌ సుబ్బరాజ్ ల సినిమాకు ‘రెట్రో’ అనే టైటిల్ ఖరారు చేశారు. హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతున్న సీన్‌తో టీజర్‌ ఓపెన్ అయింది. కాగా.. తాజాగా సితారా సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటన ద్వారా తెలిపింది. ఈ మేరకు సమాచారం అందిస్తూ.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల ద్వారా సమాచారం అందించింది. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

READ MORE: Etela Rajender : గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది

కాగా.. ‘రెట్రో’ టీజర్ ఆసక్తికరంగా ఉంది. “నా కోపం తగ్గించుకుంటాను. మా నాన్నతో దగ్గర కలిసి పని చేయడం ఈ రోజుతో ఆపేస్తాను.” అని పూజాతో సూర్య అంటాడు. రౌడీయిజం, గూండాయిజం అన్నీ మానేస్తానని మాటిస్తాడు. ఆ తర్వాత టీజర్‌లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సూర్య ఇంటెన్స్ లుక్‍లో కనిపించాడు. ప్రేమ కోసమే ఉన్నానని, పెళ్లి చేసుకుందామా అని పూజా హెగ్డేను సూర్య అడుగుతాడు. సరే అని పూజా తల ఊపుతుంది. స్వాగ్‍తో కూర్చొని సూర్య సిగరెట్ తాగే షాట్‍తో టీజర్ ముగిసింది. ఈ టీజర్‌లో జయరాం, ప్రకాశ్ రాజ్, నాజర్, జోజూ జార్జ్ సహా మరికొందరు కనిపించారు. ఈ టీజర్ సినిమాపై అభిమానులకు ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

READ MORE: Bird Flu: ‘‘సీజనల్ ప్లూ’’, తీవ్రమైన ‘‘బర్డ్ ఫ్లూ’’ నుంచి రక్షణ కల్పించవచ్చు..

Exit mobile version