Site icon NTV Telugu

Star Brothers : టాలీవుడ్‌ మార్కెట్‌పై కోలీవుడ్ బ్రదర్స్ స్ట్రాంగ్ ఫోకస్

Kollywood (2)

Kollywood (2)

రజనీ, కమల్, విక్రమ్ లాంటి సీనియర్స్ తర్వాత టాలీవుడ్ ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలు సూర్య అండ్ కార్తీ. సూర్య రక్త చరిత్ర వన్ అండ్ 2, కార్తీ ఊపిరి లాంటి బైలింగ్వల్ ఫిల్మ్స్‌లో నటించినా.. ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరించి ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్యే నాని హిట్3లో స్పెషల్ రోల్‌లో కనిపించి మెస్మరైజ్ చేశాడు కార్తీ. అయితే తెలుగు ప్రేక్షకులు తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానానికి ముగ్థులైన ఈ హీరోలు వారి రుణం తీర్చుకోవడంతో పాటు మార్కెట్ ఇంక్రీజ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

Also Read : Tollywood : ఫస్ట్ సినిమా ఫసక్.. సెకండ్ సినిమాతో కసక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఇద్దరు భామలు

సూర్యకు ఇక్కడ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ కావాల్సిందే. కానీ రక్త చరిత్ర2 తర్వాత టాలీవుడ్‌పై ఫోకస్ చేయలేదు సూర్య. రాజమౌళి బాహుబలి ఆఫర్ చేస్తే అప్పుడు తిరస్కరించిన సూర్య ఎందుకు మిస్సయ్యానని ఇప్పుడు ఫీలయ్యేలా చేశాడు జక్కన్న. కానీ ఈ సినిమాతో టాలీవుడ్ రేంజ్, దర్శకుల స్టామినా తెలుసుకున్న కోలీవుడ్ స్టార్‌ హీరో మంచి ఛాన్స్ వస్తే వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాడు. సార్, లక్కీ భాస్కర్‌తో ఫ్రూవ్ చేసుకున్న వెంకీ అట్లూరీతో కొలబరేట్ అయ్యాడు. ఇక ఆయన తమ్ముడు కార్తీని ఓన్ బ్రదర్‌గా ఫీలవుతుంటారు టాలీవుడ్ ఆడియన్స్. దానికి మెయిన్ రీజన్ లాంగ్వేజ్. తెలుగులో అద్భుతంగా మాట్లాడి చేరవయ్యాడు కార్తీ. హిట్3లో లాస్ట్‌లో ఎంటరై హిట్4కి లీడ్ తీసుకున్న ఈ స్టార్ హీరో నెక్ట్స్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమా కోసం సుమారు రూ. 23 కోట్లు తీసుకున్నాడు. మొత్తానికి టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించడంలో అన్న సూర్య కన్నా ఓ మెట్టు ఎత్తులోనే ఉన్నాడు కార్తీ.

Exit mobile version