NTV Telugu Site icon

Kollu Ravindra: పేర్ని నానికి కొల్లు రవీంద్ర కౌంటర్..

Kollu Ravindra

Kollu Ravindra

Kollu Ravindra: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అవాకులు చవాకులు పేలితే పళ్లు రాలుతాయంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.. పట్టాల ముసుగులో మీరు చేసిన నాలుగు కోట్ల బేరం త్వరలోనే బయటపడతానని ప్రకటించారు.. 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ పెట్టుకుని పేర్ని నాని అసైన్మెంట్ భూమికి పట్టాలి ఇస్తామంటూ డ్రామాలు వేస్తున్నాడు.. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే వైసీపీ పేటీఎం బ్యాచ్ కి ప్యాంట్లు తడుస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు.. తెల్లారిగానే వాళ్ల నాయకుడు ఢిల్లీకి పరిగెత్తి ఏం సాధించాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు..

Read Also: Telangana Budget 2024: త్వరలో మెగా డీఎస్సీ.. 15000 మంది కానిస్టేబుళ్లకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు

ఇక, తెలుగుదేశం – జనసేన పొత్తు ప్రజలు కోరుకున్నది అన్నారు కొల్లు.. అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశ్వసనీయత బయటపడిందన్న ఆయన.. కనీసం మీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మీతో మాట్లాడడానికి విముఖత చూపిస్తున్నారని విమర్శించారు. ఒక ఫోటో దిగేందుకు కూడా అందరిని బ్రతిమాలుకోవాల్సి వచ్చింది.. ఇది మీ దయనీయ పరిస్థితి అన్నారు. మరోవైపు.. పేర్ని నాని మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ మీద అవాకులు చవాకులు పేలితే ప్రజాక్షేత్రంలో రాజకీయ వస్త్రాపహరణ తప్పదు అంటూ హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర..

Show comments