Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ శిల్పం తొలగింపు
- మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య
- సాల్ట్‌లేక్ స్టేడియంలో శిల్పం తొలగింపు
- మమత స్వయంగా డిజైన్ చేసిన ఫుట్‌బాల్ శిల్పం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హయాంలో నిర్మించిన కట్టడాలపై ప్రస్తుత ప్రభుత్వం బుల్డోజర్ చర్యలకు దిగింది. తాజాగా కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియం దగ్గర మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన శిల్పాన్ని బుల్డోజర్తో తొలగించారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
మే 4న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బెంగాల్లో 15 ఏళ్ల మమత సర్కార్‌ను బీజేపీ కూల్చేసింది. భారీ విజయంతో కమలం పార్టీ గెలిచింది. ఇక ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించారు.
Also Read
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేసిన శిల్పాన్ని శనివారం ఉదయం బీజేపీ ప్రభుత్వం కూల్చేసింది. కోల్‌కతాలోని ప్రముఖ సాల్ట్‌లేక్ స్టేడియం వీవీఐపీ గేట్ సమీపంలో ఉన్న ఈ శిల్పం 2017లో ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ సందర్భంగా ఏర్పాటు చేశారు. రెండు కాళ్లు, పైభాగంలో ఫుట్‌బాల్ ఆకారంతో రూపొందించిన ఈ నిర్మాణం అప్పటినుంచి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. పలువురు ఫుట్‌బాల్ అభిమానులు దీని డిజైన్‌ను వింతగా.. అసహజంగా ఉందని విమర్శించారు. మరోవైపు కొందరు మాత్రం ఇది స్టేడియానికి ప్రత్యేక గుర్తింపుగా మారిందని అభిప్రాయపడ్డారు.
ఇక ఈ శిల్పంపై ‘బిశ్వ బంగ్లా’ లోగో కూడా ఉండేది. ఇది తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుగా భావించేవారు. శిల్పాన్ని తొలగించడంపై బీజేపీ నేత కేయా ఘోష్ స్పందిస్తూ.. “సాల్ట్‌లేక్ స్టేడియం ముందు ఉన్న ఆ వికృత నిర్మాణాన్ని హామీ ఇచ్చినట్టుగానే తొలగించాం” అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇటీవలే బెంగాల్ క్రీడాశాఖ మంత్రి నిశిత్ ప్రమాణిక్ కూడా ఈ శిల్పంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఇంత గొప్ప స్టేడియం ముందు ఇలాంటి అసహజమైన నిర్మాణం ఉండటం సరైంది కాదు. దీనికి ఎలాంటి అర్థం లేదు. అందుకే తొలగిస్తున్నాం” అని పేర్కొన్నారు. అలాగే స్టేడియంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు.
మరోవైపు ఈ శిల్పాన్ని రాజకీయంగా కూడా బీజేపీ నేతలు టార్గెట్ చేశారు. “ఈ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాతే గత ప్రభుత్వానికి చెడు రోజులు ప్రారంభమయ్యాయి. తర్వాత మెస్సీ టూర్ వివాదం కూడా జరిగింది. చివరకు ప్రభుత్వం కూడా అధికారాన్ని కోల్పోయింది” అంటూ నిశిత్ ప్రమాణిక్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ శిల్పం తొలగింపు
-
MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా మిస్టర్ కూల్.!
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!