Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
- ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్
- అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
- ఇకపై షెడ్యూల్ H1 కిందకు వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నొప్పి నివారణ, నరాల సంబంధిత సమస్యల చికిత్సలో ఉపయోగించే ప్రెగాబాలిన్ మందు దుర్వినియోగం పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. యువతలో ఈ ఔషధాన్ని మత్తు కోసం వినియోగిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రెగాబాలిన్ అమ్మకాలపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, ఔషధ నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ప్రెగాబాలిన్ (Pregabalin) అనే ఔషధాన్ని డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్, 1945లోని షెడ్యూల్ H1 కిందకు చేర్చింది. ఈ నిర్ణయం ద్వారా ఔషధం దుర్వినియోగం, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యం.
ఏమిటి ఈ మార్పు?
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఇప్పటి వరకు ప్రెగాబాలిన్ షెడ్యూల్ H కింద ఉండేది.
ఇకపై షెడ్యూల్ H1 కిందకు వస్తుంది. దీంతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ (చీటీ) లేకుండా ఎక్కడా అమ్మకూడదు.
ఫార్మసీలు ప్రతి అమ్మకానికి సంబంధించిన రికార్డులు నిర్వహించాలి.
ప్యాకేజింగ్‌పై ఎరుపు రంగు “Rx” సింబల్‌తో పాటు “Schedule H1 Drug” హెచ్చరిక ఉండాలి.
ఎందుకు ఈ చర్య?
ప్రెగాబాలిన్ సాధారణంగా దీర్ఘకాలిక నొప్పి (chronic pain), నరాల నొప్పులు (neuropathies), ఫైబ్రోమయాల్జియా, మూర్ఛ వ్యాధి వంటి సమస్యల చికిత్సకు వాడతారు. కానీ ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాల నుంచి ఈ మందును మత్తు (sedative/euphoric effects) కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా యువతలో ఈ ట్రెండ్ పెరిగింది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?