NTV Telugu Site icon

Kolikapudi Srinivasa Rao: ప్రచారంలో దూసుకుపోతున్న కొలికపూడి.. బ్రహ్మరథం పడుతున్న జనాలు

Kolikapudi

Kolikapudi

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి, తోటమూల గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అందులో భాగంగా.. జనం ప్రభంజనంతో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులతో, డాన్సులు వేస్తూ కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. మీ సమస్యలను తాను పరిష్కరిస్తాను అంటూ ప్రజలకు మాట ఇస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Viral Video: ఫెయిలైన విమానం ల్యాండింగ్ గేర్.. మరి ల్యాండ్ అయ్యిందంటే..

ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గంపలగూడెం మండలంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ప్రజలు తెలుపుతున్న మద్దతు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. గ్రామంలో.. ఒక డ్రైనేజీ చూశాను.. ఆ డ్రైనేజీ శుభ్రంగా లేక దోమలు పెరిగి.. వ్యాధులు పెరుగుతాయని సూచించారు. మన రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధులు వచ్చినప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎక్కువగా నష్టపోయింది తిరువూరు నియోజకవర్గ ప్రజలేనని పేర్కొన్నారు.

Amit Shah: మహ్మద్ అలీ జిన్నా గ్రేట్.. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్..

తిరువూరు నియోజకవర్గంలో ఉన్న రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, విద్యుత్ కు సంబంధించి లో వోల్టేజ్ సమస్య వల్ల ఫ్యాన్లు తిరుగుతున్నాయా అని ప్రశ్నించారు. మన ప్రక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మంత్రి అయిన భట్టి విక్రమార్క, తాను 33 సంవత్సరాలుగా మంచి స్నేహితులమని అన్నారు. ఆయన దగ్గర కూర్చుని వాళ్లకి మనకి మధ్య ఉన్న రోడ్లు సమస్యలు, మరే ఇతర సమస్యలైన ఆయన ద్వారా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలలో ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కారిస్తామని తెలిపారు.