Site icon NTV Telugu

Anil Kumble: టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ ఇదే ఫామ్ కొనసాగించాలి..

Anil Kumble

Anil Kumble

ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్ (PBKS)పై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మరోవైపు.. పంజాబ్ ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు లేకుండాపోయాయి. ఇదిలా ఉంటే ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు.. ఎందుకంటే ఆ జట్టు తన రెండు మ్యాచ్‌లను ఎలాగైనా గెలవాలి.. ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడవలసి ఉంటుంది. మరోవైపు.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 92 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సీజన్లో విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్ లో ఉండి మంచిగా రాణిస్తున్నాడు.

Fatehpur Sikri Dargah: ఫతేపూర్ సిక్రీ దర్గా కింద కామాఖ్య దేవత ఆలయం ఉంది.. ఆగ్రా కోర్టులో కేసు..

ఈ క్రమంలో జియో సినిమాలో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ ఫామ్ పట్ల ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. విరాట్ తిరుగలేని ఫామ్లో కనిపిస్తున్నారు.. అత్యుత్తమంగా ఆడుతున్నారని అన్నారు. అంతేకాకుండా.. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారని.. టీ20 వరల్డ్ కప్లో భారత్ తరుఫున ఇదే ఫామ్ను కొనసాగించాలని అనిల్ కుంబ్లే తెలిపారు.

Team India: టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన ఆటగాళ్లకు చాలా అనుభవం ఉంది.. విశ్వాసం వ్యక్తం చేసిన జైషా

మరోవైపు.. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్‌ను కూడా అనిల్ కుంబ్లే ప్రశంసించారు. “రజత్ ఇప్పుడు అంతర్జాతీయ ఆటగాడు. విరాట్ కోహ్లీ ఒంటరి ప్రదర్శన చేస్తున్నందుకు మిడిల్ ఆర్డర్ బాగా ఆడటం ఆర్సీబీకి ఎంతో ముఖ్యమైనది. పవర్ ప్లేలో ఫాఫ్ డు ప్లెసిస్ ఇన్నింగ్స్ ప్రారంభంలో కొన్ని పరుగులు చేశాడు. మరోవైపు.. ఆర్సీబీకి మరొక బలమైన ఆటగాడు అవసరం. పాటిదార్ జట్టుకు కొన్ని మ్యాచ్లలో బాగా రాణించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ ఆడడం గత మూడు నాలుగు మ్యాచ్ల్లో చూశాం. విరాట్ కోహ్లీతో అతని భాగస్వామ్యం బాగుందని” అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు.

Exit mobile version