NTV Telugu Site icon

IND vs PAK: శతక్కొట్టారు.. సెంచరీలతో అదరగొట్టిన కోహ్లీ, రాహుల్

Centuarys

Centuarys

IND vs PAK: ఆసియా కప్ 2023లో భాగంగా.. టీమిండియా బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో అదరగొట్టారు. కేఎల్ రాహుల్ 100 బంతుల్లో ఎదుర్కొని సెంచరీ చేయగా.. కోహ్లీ 84 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో కోహ్లీ అరుదైన రికార్డును సాధించాడు. వేగంగా వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 13000 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే కోహ్లీకి వన్డే కెరీర్ లో ఇది 47వ సెంచరీ.

Read Also: Indigo Flight: విమానంలో మహిళపై అసభ్య ప్రవర్తన.. వ్యక్తి అరెస్టు

మరోవైపు మరో బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 5 నెలల తర్వాత మైదానంలోకి వచ్చిన రాహుల్.. 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. పాకిస్థాన్‌పై భారత్‌ విజృంభించడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ విజయలక్ష్యం 357 పరుగులు ఉండగా.. ఇప్పుడు మ్యాచ్ టీమిండియా బౌలర్లపై ఆధారపడి ఉంది. విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ 94 బంతుల్లో 122 పరుగులు చేశాడు. విరాట్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 111 పరుగులు చేశాడు. అటు పాక్ బౌలర్లలో షాదాబ్, షాహీన్ అఫ్రిది చెరో వికెట్ తీశారు.

 

Show comments