Kodali Nani: సీఎం జగన్‌పై దాడి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో, ఇప్పుడు దాడులు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు చెప్పారన్నారు. కులాన్మాదంతో ముదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు మాటలు విని సీఎం జగన్‌ను చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారంగా గురి చూసి కొట్టాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్ను వద్ద తగిలింది.. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారన్నారు.
Read Also: Purandeswari: సీఎం జగన్‌పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది..
Also Read
దాడిని ఖండించాల్సిన పెద్దలు.. సంస్కారహీనంగా సీఎం జగనే తనపై దాడి చేయించుకున్నారని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన 9 సంస్థలు చేసిన సర్వేల్లో 125 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్తున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా ఏమీ చేయలేని కొందరు రాజకీయ నిరుద్యోగులు.. విజయవాడ నడిబొడ్డున కొన్ని వర్గాలతో కలిసి జగన్మోహన్ రెడ్డి పై దాడి చేశారన్నారు. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయడానికి ప్రయత్నం జరిగిందంటే.. దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారని ఆరోపించారు. ఎంతో పక్కాగా దాడి చేయబట్టే సీఎం జగన్‌కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలి ఆయన గాయపడ్డారన్నారు.
ప్రధాని, సీఎం స్థాయి వ్యక్తులు రోడ్ షోగా వెళ్లేటప్పుడు పగలైనా రాత్రయినా కరెంటు తీసేస్తారని.. ఆ విషయం సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియదా.. బస్సుపై ఆయన రోడ్ షోలు చేసినప్పుడు కరెంటు తీయలేదా అంటూ ప్రశ్నించారు. సీఎం జగనే కావాలని కరెంటు తీయించారని పిచ్చివాగుడులు వాగుతున్నారని మండిపడ్డారు. అధికారులపై యాక్షన్ తీసుకోవాలంటూ చంద్రబాబు 420 వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!