Site icon NTV Telugu

Kodali Nani : మళ్లీ గెలిచాక 6 నెలల్లోనే రోడ్లు వేస్తాం

Kodali Nani

Kodali Nani

రోడ్లపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తొలి ఆరు నెలల్లోనే రోడ్లన్నీ వేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లపై సీఎం జగన్ మేనిఫెస్టోలో కీలక ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికే తమకు 2 ఏళ్లు పట్టిందని అన్నారు. ఆ తర్వాత కరోనా వచ్చి, పనులు ఆగిపోయాయని నాని వివరించారు. అంతేకాకుండా.. మేమూ సిద్ధం అంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తు‍న్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కొడాలి నాని సెటైర్లు వేశారు. వైఎస్సార్‌సీపీపై అభ్యర్థుల్ని కూడా నిలబెట్టి అప్పుడు సిద్ధం అంటే బాగుంటుందంటూ చురకలంటించారాయన.

Arvind Kejriwal: పెరిగిన నీటి బిల్లులపై అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చిన ఢిల్లీ సీఎం..

మేం సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటున్నారు. ఎన్నికల కోసం జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.. మరి మీరు దేనికి సిద్ధం? అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా?. క్యాండిడేట్లను పెట్టరా? ఫ్లెక్సీలే పెడతారా?. మాపై మీ అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటే బాగుంటుంది అని పవన్‌కు కొడాలి నాని సూచించారు.

Karnataka: కర్ణాటకలో దేవాలయాలు పన్ను చెల్లించాల్సిందే.. ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం

Exit mobile version