Kodali Nani and Perni Nani: ప్రతి నియోజకవర్గంలో దాడులకు గురైనవారి ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలుస్తాం అని ప్రకటించారు మాజీ మంత్రి కొడాలి నాని.. కౌంటింగ్ అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇళ్లు, కార్లు ద్వంసం చేసి దాడులు చేస్తున్నారు.. వైసీపీ నేతలను, క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు జరుగుతున్నాయని.. ఈ దాడులకు పోలీసులు దగ్గర ఉండి చేయిస్తున్నారని విమర్శించారు. దాడులు జరుగుతుంటే.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.. టీడీపీ అల్లరి మూకల మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టులో కేసులు వేస్తామని పేర్కొన్నారు కొడాలి నాని.
Read Also: Rohit Sharma Injury: టీమిండియాకు బిగ్ షాక్.. మళ్లీ గాయపడిన రోహిత్ శర్మ
మరోవైపు.. టీడీపీ, జనసేన రౌడీ మూకలు రెచ్చిపోయి మారణ హోమం చేస్తున్నారని మండిప్డడారు మాజీ మంత్రి పేర్ని నాని.. టీడీపీ నేతలు, డీజీపీ కేసులు పెట్టవద్దని పోలీసులకి ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. యూపీ, బీహార్ మాదిరి హింసా రాష్ట్రంగా టీడీపీ మారుస్తోంది.. అరాచక మూకలను ఆపాల్సిన పోలీసులు బెదిరిస్తున్నారు.. కౌంటింగ్ పూర్తి అవ్వక ముందే బందరు లో దాడులకు తెగ బడ్డారని ఆరోపించారు. ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయటం లేదన్న ఆయన.. టీడీపీ నేతలు పోలీసులను పతనావస్థకు తెచ్చారని ఫైర్ అయ్యారు. బరితెగించి మరీ దాడులకు పాల్పడుతున్నారు.. పైగా వైసీపీ వాళ్లు కొడుతున్నారు అని మాట్లాడటం దారుణం అన్నారు పేర్ని నాని.