KL Rahul: గ్యాపే దొరకలే.. చాలా అలసిపోయా: కేఎల్ రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Rect on Shower during IND vs AUS Match: ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కీపింగ్ చేసి అలసిపోయిన తనకు భారత్ బ్యాటింగ్ సమయంలో స్నానం చేసే టైమ్ కూడా దొరకలేదని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. భారత్‌కు ప్రపంచకప్ అందించడమే తన కల అని పేర్కొన్నాడు. తన ప్రదర్శన పేలవంగా ఏమీ లేకపోయినా జనం తనను విమర్శించినప్పుడు బాధపడ్డానని రాహుల్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు.
భారత్ బౌలింగ్ దాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. 97 పరుగులతో అజేయంగా నిలిచిన తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. టీమిండియా విజయం అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రాహుల్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అనంతరం కీపింగ్ చేసి అలసిపోయిన తాను స్నానం చేసి ఓ గంట పాటు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడట. అయితే భారత్ త్వరగా మూడు వికెట్స్ కోల్పోవడంతో.. మూడో ఓవర్లోనే రాహుల్ మైదానంలోకి వచ్చాడు.
Also Read
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
‘గతంలో ప్రతి మ్యాచ్‌లో నా ప్రదర్శనను జనం తీవ్రంగా విమర్శించారు. నా ప్రదర్శన అంతా పేలవంగా ఏమీ లేకపోయినా.. ఎందుకలా విమర్శించారో అర్థం కాలేదు. అప్పుడు చాలా బాధనిపించింది. గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐపీఎల్ 2023 సందర్భంగా గాయపడ్డా. 5-6 నెలలు ఆటకు దూరమయ్యా. ప్రపంచకప్‌లో ఆడడం కూడా అనుమానంగా మారింది. అది నాకు చాలా కష్టంగా అనిపించింది. దేవుడి దయతో త్వరగా కోలుకున్నా. ప్రపంచకప్‌లో ఆడడం ప్రతి క్రికెటర్ కల. సొంతగడ్డపై భారత్‌కు ప్రపంచకప్ అందించడమే నా లక్ష్యం’ అని రాహుల్ తెలిపాడు.
Also Read: Mr Tamilnadu Death: ‘మిస్టర్ తమిళనాడు’ మృతి.. బాత్రూమ్కు వెళ్లి..!
‘ఆస్ట్రేలియా మ్యాచులో భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి సమయంలో నేను క్రీజులోకి వచ్చాను. అప్పుడు నేను, విరాట్ కోహ్లీ పెద్దగా మాట్లాడుకోలేదు. అయితే పిచ్ కష్టంగా ఉంది.. కాసేపు టెస్ట్ మ్యాచ్ ఆడు అని విరాట్ సలహా ఇచ్చాడు. వికెట్ కీపింగ్ చేసిన నేను చెన్నైలో ఉక్కపోతకు చాలా అలసిపోయా. స్నానం చేసి ఓ హాఫ్ అన్ హావర్ లేదా గంట రెస్ట్ తీసుకుందామనుకున్నా. కానీ నాకు ఆ టైమ్ దొరకలేదు’ అని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ చెప్పాడు.
తాజావార్తలు
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?