KKR VS RCB:ఈడెన్ గార్డెన్సలో జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా 222 పరుగులు చేసింది. బెంగళూరు ఈ మ్యాచ్ గెలవాలంటే 223 రన్లు సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు ప్రతిభ కనబరిచారు. గత ఏడు మ్యాచులలో సరైన బౌలింగ్ లేక వరుస ఓటముల పాలైన బెంగళూరు టీంకి కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్లో బౌలర్లు చేయూత నందించారు.
READ MORE: INDIA Bloc Rally: జైలులో ఉన్న వారి కోసం ఖాళీ కుర్చీలు.. ఇండియా కూటమి ర్యాలీలో కీలక దృశ్యం..
ఈ సీజన్ మొత్తంలో బెంగళూరు బౌలర్లు మొదటి సారి 6 వికెట్లు తీసుకున్నారు. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన కోల్ కతా ఓ పెనర్లు సునిల్ నరైన్ 10 రన్లు చేశాడు. సాల్ట్ 48 పరుగులు సాధించి ఓపెనర్ గా టీంకి మంచి చేయూతనందించాడు. శ్రేయస్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ ఆఫ్ సెంచరి పూర్తి చేసుకున్నాడు. రఘువంశి(3), వెంకటేశ్ అయ్యర్(16), రింకు సింగ్(24), రసెల్(27), శ్రేయస్ వికెట్ తరువాత బరిలోకి దిగిన రన్ దీప్ సింగ్ కేవలం 9 బాల్ లలో 24 రన్లు పూర్తి చేసి నాట్ అవుట్ గా నిలిచారు. బెంగళూరు బౌలర్లయిన యస్ దయాల్, గ్రీన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్, ఫెర్గూసన్ చెరో వికెట్ తీసుకున్నారు.