KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్‌లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్‌పై భారీ విజయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KKR vs DC: ఐపీఎల్ 2026 లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ జట్టు విజయంతో తమ సీజన్‌ను ముగించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించారు. పోరెల్ 22 పరుగులు చేసి అవుట్ కాగా, కేఎల్ రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీతో 60 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. తర్వాత సహిల్ పరాఖ్ 24 పరుగులు చేయగా, కెప్టెన్ అక్షర్ పటేల్ దూకుడుగా ఆడి 39 పరుగులు జోడించాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ 28 పరుగులతో వేగంగా స్కోరు పెంచడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కోల్‌కతా బౌలర్లలో సౌరభ్ దూబే రెండు వికెట్లు తీయగా.. అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు.
Also Read
204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్ అజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రహానే 39 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపేలా ప్రయత్నం చేశాడు. KKR ఇన్నింగ్స్ లో ఫిన్ అలెన్ 20 పరుగులు, మనీష్ పాండే 25 పరుగులు, రోవ్‌మన్ పావెల్ 29 పరుగులతో కొంతసేపు ఆశలు రేపారు. అయితే మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కేకేఆర్ బ్యాటింగ్ కుప్పకూలింది. కామెరూన్ గ్రీన్ కేవలం రెండు పరుగులకే అవుట్ కాగా, రింకూ సింగ్ డక్‌గా వెనుదిరిగాడు. ఇంకా తేజస్వి దహియా ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు.
ఢిల్లీ బౌలర్లలో లుంగీ ఎంగిడి, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా ఢిల్లీ వైపు తిప్పారు. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు సాధించగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఫలితంగా కోల్‌కతా జట్టు 163 పరుగులకే పరిమితమై 40 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని విజయంతో ముగించగా, కేకేఆర్ అభిమానులకు మరోసారి నిరాశ మిగిలింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!