Kishore Tirumala: టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ‘నేను శైలజ’ సినిమా కూడా ఒకటి. హీరో రామ్ పోతినేని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమాతోనే ‘మహానటి’ కీర్తి సురేశ్ తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన డ్రామా జరిగిందని దర్శకుడు కిషోర్ తిరుమల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతకీ ఆ డ్రామా ఏంటోఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Chiranjeevi-Mega 158: ‘మెగా 158’ టైటిల్ వైరల్.. ఇదే ఫైనలా?
ఈ సందర్భంగా డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ‘శైలజ’ పాత్ర ఒక ఇంట్రోవర్ట్. ఆ పాత్రకు కీర్తి సురేశ్ అయితేనే పర్ఫెక్ట్గా సరిపోతుందని నేను బలంగా నమ్మాను. కానీ ఆ సమయంలో కీర్తికి ఇది మొదటి సినిమా కావడం వల్ల, నిర్మాతలు అప్పటికే ఫామ్‌లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని చెప్పారు. నిర్మాతల ఒత్తిడితో అప్పట్లో టాప్‌లో ఉన్న ఒక హీరోయిన్‌కు కథ చెప్పడానికి వెళ్లాను. అయితే ఆమె ఈ సినిమాలో హీరోయిన్ రోల్‌ను తిరస్కరించేలా నేనే కావాలని కథను సరిగ్గా చెప్పలేదు. దీంతో కథ నచ్చలేదని ఆ హీరోయిన్ చెప్పగానే, నేను ఏమాత్రం బాధపడకుండా “థాంక్యూ” చెప్పి వచ్చేశాను. ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉన్న ఆ హీరోయిన్ను తీసుకుంటే, ఆమెకు అప్పటికే ఉన్న పాత ఇమేజ్ను బ్రేక్ చేసి నా సినిమాలో ‘శైలజ’గా చూపించడం కష్టమని భావించాను. అందుకనే కొత్త అమ్మాయి అయితేనే ప్రేక్షకులు తనను నిజంగా ‘శైలు’గా ఫీల్ అవుతారని నమ్మి, అంత రిస్క్ తీసుకున్నాను. చివరకు నా నమ్మకమే నిజమైంది. కీర్తి సురేష్ తన నటనతో శైలజ పాత్రకు ప్రాణం పోసింది’ అని వెల్లడించారు. ఇటీవలే డైరెక్టర్ కిషోర్ తిరుమల మాస్ మహారాజా రవితేజ హీరోగా భర్తమహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో మంచి హిట్ కొట్టాడు.
READ ALSO: Suryakumar Yadav: నేను ఫామ్‌లోకి రావడానికి కారణం ఆమెనే: సూర్యకుమార్ యాదవ్