‘మెగాస్టార్’ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రీజనల్ సినిమా రికార్డులన్నీ తిరగరాసి ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది శంకర వరప్రసాద్. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ గ్రాండ్ సెలబ్రేషన్‌ను ప్లాన్ చేసింది. జనవరి 25వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి.
ఓవైపు శంకర వరప్రసాద్ సక్సెస్ జోష్‌లో ఉన్న చిరంజీవి.. మరోవైపు ‘మెగా 158’పై కూడా ఫోకస్ చేశారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉంది. హీరోయిన్‌గా ప్రియమణి ఫైనల్ అయినట్టుగా తెలుస్తుండగా.. మళయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించనున్నారు. కూతురి సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
Also Read: Pawan Kalyan-Nanded: నాందేడ్‌లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
ఈ సినిమా మెగా 158 వర్కింగ్ టైటిల్‌తోనే సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో టైటిల్ ఏంటనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది. లేటెస్ట్‌గా తెలిసిన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ‘కాకాజీ’ అని కూడా అనుకుంటున్నారట. ప్రస్తుతానికైతే ఇది టైటిల్ టెస్ట్ లాంటిదేనని చెప్పాలి. ఫైనల్ టైటిల్ ఏంటనేది త్వరలోనే క్లారిటీ రానుంది. డైరెక్టర్ బాబీ ఈసారి వాల్తేరు వీరయ్యకు మించి ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. చూడాలి మరి చిరు ఖాతాలో మరో హిట్ పడుతుందో.