తన గొంతు ద్వారా తెలుగు సమాజమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా రోల్ మాడల్ గా మార్చిన గొప్ప గాయకుడు గద్దర్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది.. సిద్ధాంతాలు వేరైనప్పటికీ అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్నారు.. తెలంగాణ సాధన కోసం అంకిత భావంతో పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని ఆయన పేర్కొన్నారు. నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధం గద్దర్ తో ఉంది.. నేను లేకున్నా మా ఇంటికి వచ్చి భోజనం చేసే వారు.. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి, తెలంగాణ కవులు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ మేధావులకు, ఎంతో బాధ కలిగించే ఘటన ఇది అని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
నేను హాస్పిటల్ కు వెళ్లి గద్దర్ తో మాట్లాడాను అని కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. కలిసి పోరాటం చేద్దాం అన్నారు.. ఆయన కలగన్న రాజ్యం రాకముందే స్వర్గస్తులయ్యారు.. సమస్యల పైన తిరుగు లేనటువంటి పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు గద్దర్ అని తెలిపారు. తన గొంతు ద్వారా తెలుగు సమాజమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా రోల్ మాడల్ ఇచ్చినటువంటి గొప్ప గాయకుడు గద్దర్ అని కిషన్ రెడ్డి చెప్పారు.
Read Also: Credit card vs Buy Now Pay Later: ఈ రెండిటిలో ఏది బెస్ట్ ఆప్షన్.. క్రెడిట్ కార్డా లేక పే లేటర్ ?
గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయం అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు.. నాతో పాటు పాల్గొన్న అనేక సందర్భాలలో మా జాతీయ నాయకులు అద్వాని, వాజ్ పేయి, వెంకయ్య నాయుడుతో గద్దర్ కు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నిజాం కాలేజీలో అద్వాని బహిరంగ సభకి ముందు వరుసలో కూర్చొని మధ్యలో ముందు వరుసలో కూర్చున్న సందర్భం మర్చిపోలేదు అని చెప్పారు. గద్దర్ ఆకస్మిక మృతికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.