Site icon NTV Telugu

Kishan Reddy : కేసీఆర్ అహంకారం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు

Kishan Reddy

Kishan Reddy

కేసీఆర్‌కు ఈ ఎన్నికలో ఇతర రాష్ట్రాల నేతలు ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. నీ ఫార్మ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో నీతో కలిసి భోజనం చేసిన ఆ నేతలు ఎక్కడికి పోయారని, కేంద్రం లో సంకీర్ణం వస్తదని కెసిఆర్ అంటున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు కూతలు తప్ప కారుకు అడ్రస్ ఉండదన్నారు కిషన్‌ రెడ్డి. తెలంగాణ లో కెసిఆర్ అధికారం లోకి రావాలని ఎవరు కోరుకోవడం లేదని, కేసీఆర్ అహంకారం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. నీ సీఎం కుర్చికే తెలంగాణ ప్రజలు ఎసరు పెడుతున్నారన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి వస్తె 6 నేలలోకి సీఎం మారుతారు అని అంటున్నారు… మరి కేంద్రం లో సంకీర్ణం వస్తె 3 నెలలో కో ప్రధాని వస్తాడన్నారు కిషన్‌ రెడ్డి.

అంతేకాకుండా..’సీఎం ఉపన్యాసాలలో వాడి వేడి లేదు… మాటల గారడీ లేదు. భయపెట్టి జనాలను సీఎం మీటింగ్ తీసుకొస్తున్నారు… తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయం… మా వెంబడి యువత ఉంది… బీజేపీ గెలుపు కి మహిళలు, యువత కీలక పాత్ర పోషిస్తారు. 76 సంవత్సరాల తరవాత అయిన బీసీ సీఎం రావాలని బీసీ సామాజిక వర్గాలు గుర్తించాలని మనవి చేస్తున్న … బీజేపీ చెప్పడమే కాదు చేసి చూపిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాలు దేశ అభివృద్ధి కి. కేసీఆర్ తో వచ్చేది ఒకే ఒక పార్టీ అది మజ్లీస్… ఈ నెల 17 సాయంత్రం అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. 18 న గద్వాల్, నల్గొండ, వరంగల్, రంగ రెడ్డి లలో ప్రచార సభల్లో పాల్గొంటారు. బీసీ సామాజిక వర్గాల సభలు నిర్వహిస్తామని… బీసీ వర్గాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చి చెప్పారు. ఆ బీసీ సంఘాలకు ధన్యవాదాలు.. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీసీ సదస్సులు పెడతామని బీసీ సంఘాలు ముందుకు వచ్చారు.. 26, 27 తేదీల్లో పు… అన్ని అసెంబ్లీ లలో బీజేపీ కి మద్దతు గా సదస్సులు.. తొలి బీసీ సీఎం తో పాటు బీసీ సబ్ ప్లాన్, కుల వృత్తులు న్యాయం చేస్తాం. మత ప్రాతిపదికన ఉన్న ముస్లిం రిజర్వేషన్ లు తొలగిస్తాం… ఆ నాలుగు శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు పెంచుతాం… టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం… 6 నెలల్లో ఖాళీలు భర్తీ చేస్తాము… జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. తెలంగాణ బీసీ సీఎం చేతుల మీదుగా ప్రతి నెల మొదటి వారం లో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తాము… కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కుహనా లౌకిక వాదం తో దేశాన్ని బ్రష్టు పట్టించాయి… ‘ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version