NTV Telugu Site icon

Kishan Reddy : బీజేపీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు అవుతారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పలేము

Kishan Reddy

Kishan Reddy

బీజేపీ శిక్షణా తరగతులు హైదరాబాద్‌లోని శామీర్‌పేటలో గల రిసార్ట్‌లో జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులను తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్‌ ప్రారంభించారు. అయితే మొదటి రోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే.. బీజేపీకి చాలా ప్రత్యేకత ఉందన్నారు. కొన్ని రాజకీయ పార్టీల్లో అడ్రస్ లేని వాళ్లకు కూడా పార్టీ పదవులు ఇస్తుంటారని, గ్రామ కమిటీ నుంచి జాతీయ స్థాయి వరకు నిర్మాణం వుంటుందన్నారు.
Also Read : Surya Kumar Yadav: సూర్యకుమార్ విధ్వంసం.. పాక్ కెప్టెన్ బాబర్ రికార్డ్ బ్రేక్

కొన్ని రాజకీయ పార్టీలు కనుమరుగు అవుతున్నాయని, కుటుంబ ఆధార పార్టీల్లో అధ్యక్షులు, ముఖ్యమంత్రులు ఎవరు అవుతారో చెప్పవచ్చన్నారు. బీజేపీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు అవుతారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పలేమన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘పార్టీ గుర్తింపు ఎన్నికల ద్వారానే లభిస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో
ఒక ముఖ్యమంత్రి కూతురిని, ముఖ్యమంత్రి బంధువును ఓడించాం. ఎమ్మెల్యే క్యాండేట్ ఆర్థికంగా బలంగా లేరని అనుకోవద్దు.. ప్రజల్లో ఉండి పోరాడాలి.. ప్రజలకు విశ్వాసం కల్పించాలి. ప్రత్యామ్నాయం కావాలంటే ప్రజల నుంచే నాయకత్వం వస్తుంది.

Also Read : Vijayanand: ‘కాంతార’ ను మించి మరొకటి.. అదిరిపోయిన విజయానంద్ ట్రైలర్
సమగ్ర కార్యచరణతో క్షేత్ర స్థాయిలో కి వెళ్ళాలి. టీఆర్ఎస్ లో ఉన్న కొంత మంది కూడా బిజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. IAS, IPS అధికారులు కూడా తెలంగాణలో బిజేపీ రావాలని ఆశిస్తున్నారు. పార్టీ నేతలు
ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళాలి. పాత, కొత్త తేడా లేకుండ కలిసి వెళ్ళాలి. చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. సిద్ధాంతం కోసం కలిసి పనిచేయాలి. కేసీఆర్‌ తొండి ఆట ఆడుతున్నారు.. అభద్రతా భావంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నాయకత్వoపై విమర్శలు చేసి మళ్ళీ ఓట్లు పొందాలని చూస్తున్నారు. వాళ్ళు ఎం చేశారో చెప్పి ఓట్లు అడగడం లేదు. జవాబు చెప్పకుండా దొంగే.. దొంగ దొంగ అని అరుస్తున్నట్లు ఉంది. అధికార పార్టీ అబద్ధాలను తిప్పికొట్టడానికి అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాలి. డబ్బులు, బెదిరింపులకు ఆదరకుండా మునుగోడు ప్రజలు బిజేపీ వైపు నిలిచారు. మునుగోడులో నైతిక విజయం బీజేపీదే.

ఎవరిపైన వ్యక్తిగత కక్ష లేదు.. తెలంగాణ కోసం, దేశం కోసం పనిచేస్తాం. కుటుంబ పాలన కారణంగా దేశ అభివృద్ధి కుంటు పడుతుంది. కుటుంబ పాలన కు వ్యతిరేకంగా సైద్ధాంతిక ఆలోచన తో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఢిల్లీలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన బ్రోకర్లు కనిపించరు. పారదర్శకంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మోడీ హయాంలో గ్యాస్ కంపెనీలు ఇంటికి వచ్చి కనెక్షన్లు ఇస్తున్నాయి. దేశంలో 18 వేల గ్రామాలకు విద్యుత్ సమస్యలు పరిష్కరం చేశాం.’ అని ఆయన వ్యాఖ్యానించారు.