Vijayanand: కన్నడ సినిమాలు అన్ని ఇండస్ట్రీలను ఆశ్చర్యపరుస్తున్నాయి. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలనైనా ఆదరిస్తారని గ్రహించిన కన్నడిగులు మంచి మంచి కథలతో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తున్నారు. కెజిఎఫ్ మొదలుకొని కాంతార వరకు కన్నడ హీరోలు అన్ని ఇండస్ట్రీలలో తమ సత్తాను చాటుతున్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన కాంతార ఎంతటి భారీ విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో అద్భుతమైన సినిమా విజయానంద్. ప్రముఖ విఆర్ఎల్ గ్రూప్స్ చైర్మన్ విజయ్ సంకేశ్వర్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక సామాన్య వ్యక్తి.. ఎన్నో అడ్డంకులును ఎదుర్కొని ఒక పెద్ద సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు. అందులో ఆయన పడిన అవమానాలు ఏంటి..? ఎన్ని కుటుంబాలకు ఆ వ్యక్తి అధిపతిగా నిలిచాడు..? లాంటి అంశాలను ఇందులో చూపించారు.
కుర్ర హీరో నిహాల్ రాజపుత్ ఈ సినిమాలో విజయానంద్ గా కనిపించాడు. రిషిక శర్మ ఈ చిత్రంని దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తండ్రి మాటను కాదని బయటికి వచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకుంటాడు విజయానంద్. కానీ బయటికి వచ్చాకా అతడు ఎన్ని అడ్డంకులును ఎదుర్కున్నాడు. సొంతవాళ్లే అతనిని మోసం చేశారా..? ఒక్క లారీతో మొదలైన అతని జీవన ప్రస్థానం విఆర్ఎల్ గ్రూప్ గా ఎలా ఎదిగింది..? తండ్రి ముందు విజయానంద్ తల ఎత్తుకొని నిలబడ్డాడా..? అనేది కథగా తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ ను బట్టే ఈ ట్రైలర్ పై అంచనాలను పెంచేశారు మేకర్స్. తెలుగు మెలోడియస్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాంతార ను మించి ఈ సినిమా హిట్ టాక్ ను అందుకుంటుందా..? లేదా అనేది చూడాలి.