NTV Telugu Site icon

Kishan Reddy: రాజ్యాంగ పట్ల గౌరవం చూపితేనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని, ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని పెంపొందించడానికి బీజేపీ చేపట్టిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం హైదరాబాద్ నగర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, ఇది ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించే గొప్ప పత్రిక అని పేర్కొన్నారు. అనేక దేశాలకు భారత రాజ్యాంగం ఒక మోడల్‌గా ఉందని, ప్రజలు రాజ్యాంగ పట్ల గౌరవం చూపితేనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ రాజ్యాంగాన్ని వక్రీకరించిన చరిత్ర ఉందని, కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: Jupiter CNG Scooter: ఇక పెట్రోల్ కష్టాలకు చెక్.. వచ్చేస్తున్న CNG స్కూటర్‌

కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించిందని, అధికారం కోసం అనేక మార్పులు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని చెప్పారు. తన ప్రధాని పదవిని కాపాడుకోవడానికి ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ కాలం రాజ్యాంగ దుర్వినియోగానికి ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. మహిళలు, మైనార్టీల హక్కులనుకాంగ్రెస్ పార్టీ తేలికగా తీసుకున్న తీరును విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడం వంటి చర్యల ద్వారా ప్రజల తీర్పులను కాలరాశిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని ప్రదర్శించిందని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read: NTR’S Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్లో జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాజ్యాంగాన్ని నమస్కరించి పార్లమెంటులో అడుగుపెట్టిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. రాజ్యాంగ అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26నుంచి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారత రాజ్యాంగ గౌరవ ప్రచార కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో రాజ్యాంగంపై అవగాహన పెంచుతామని బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన చరిత్రను ప్రజలకు వివరించడమే కాకుండా, రాజ్యాంగ గౌరవం పట్ల బీజేపీ కమిట్మెంట్‌ను ప్రజల ముందుంచుతామని కేంద్ర మంత్రి అన్నారు. బీజేపీ ప్రభుత్వం అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చేస్తూ, దేశ ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు.