Kishan Reddy: బీజేపీ నిరాశ నిస్పృహలో లేదంటూ కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోంది అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలి.. విభజన సమస్యలపై పట్టింపులకు పోవద్దు.. లోక్ సభ స్థానాలు పెంపు రాజ్యాంగ పరమైన ప్రక్రియ అని ఆయన అన్నారు. పునర్విభజన చట్టం ఉంది.. దక్షిణ భారత్ కు చెందిన రాష్ట్రాలపై సైతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని తెలిపారు. సౌత్- నార్త్ కు లింక్ పెట్టొద్దు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: MLA Housemaid Suicide: ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య.. కేసులో షాకింగ్ ట్విస్ట్
Also Read
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
దక్షిణాది నుంచి కూడా ప్రధానులు అయ్యారు.. బీజేపీలో చేరిన వారు.. మళ్ళీ వెళ్లి పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. రాష్ట్రంలో టీఆర్ఎస్-కాంగ్రెస్ లు కలిసి కుట్రలు చేస్తున్నాయి అని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలెందుకు కాంగ్రెస్ బలంగా ఉండాలని కేసీఅర్ కోరుకుంటున్నారు.. లక్షలాది మంది యువత బీజేపీ పార్టీలో చేరుతోంది అని గుర్తు చేశారు. కొందరు చేరనంత మాత్రానా పార్టీకి కలిగే నష్టం ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నిరాశ నిస్ర్పృహ లో లేదు అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Rahul Gandhi: బీజేపీని ఓడించొచ్చు.. అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత సంవత్సరం ఢిల్లీలో తెలంగాణా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాం.. ఈ సారి తెలంగాణా ఆవిర్భావ ఉత్సవాలు గోల్కొండ కోటలో నిర్వహిస్తామన్నారు. ఖిల్లా కహానీ పేరుతో హైదరబాద్ లో పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ హాజరవుతున్నారు. తెలంగాణ లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్ లో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవం కోసం జరిగిన స్వాభిమాన పోరాటం.. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ పోరాడిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అభివృద్ధి అంశాలపై వివరిస్తామన్నారు. ఈ రిపోర్ట్ ప్రజల్లోకి తీసుకు వెళ్తామని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?