MLA Housemaid Suicide: ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య.. కేసులో షాకింగ్ ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore MLA Sanjeevaiah Housemaid Arunakumari Suicide Mystery: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే చిలివేటి సంజీవయ్య ఇంట్లో పనిచేస్తున్న అరుణకుమారి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. అయితే.. ఈ కేసులో ఓ షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. వివాహేతర సంబంధమే ఆమె ఆత్మహత్యకు కారణమనే కోణం తెరమీదకి వచ్చింది. కొన్ని నెలల క్రితమే అరుణకుమారిని ఆమె బంధువులు ఎమ్మెల్యే సంజీవయ్య ఇంట్లో పనికి కుదిర్చారు. మొదట్లో అంతా సజావుగానే సాగింది కానీ, ఎప్పుడైతే ఆమెకు ఎమ్మెల్యే కార్యాలయంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తేజ పరిచయం అయ్యాడో, అప్పటి నుంచి ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Adipurush: రోజుకి 100 కోట్లు! మండేకి ఆల్ రికార్డ్స్ అవుట్?
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
రోజులు గడిచేకొద్ది అరుణకుమారి, తేజ మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఇద్దరు కలిసి షికారుకి వెళ్లిన వీడియోలను సైతం రికార్డ్ చేశారు. ఈ విషయం అరుణకుమారి కుటుంబసభ్యులకు తెలియడంతో.. వాళ్లు మందలించారు. ఒకసారి తేజను నెల్లూరు నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లి.. అరుణకుమారి భర్త, అతని స్నేహితులు తీవ్రంగా మందలించారు. మరోసారి సన్నిహితంగా మెలిగితే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. అయినా ఇద్దరిలో మార్పు రాలేదని అరుణకుమార్ భర్త గణేశ్ ఆరోపణలు చేస్తున్నాడు. తేజ వల్లే తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని, తన భార్య మృతికి అతడే కారణమని ఆరోపిస్తున్నారు. అరుణకుమారి మృతిచెందిన నాలుగు రోజుల తర్వాత తనకు పోలీసులు సమాచారం అందించారని.. చనిపోయిన వెంటనే ఎందుకు తెలియచేయలేదని గణేష్ నిలదీస్తున్నాడు.
Vasantha Krishna Prasad: దేవినేని ఉమా.. మంత్రి మల్లారెడ్డి లాగా పూలు, పాలు అమ్మావా?
తనకు పిల్లలు ఉన్నారని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని గణేష్ కోరుతున్నాడు. మరోవైపు.. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తేజను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల పాటు జైల్లో పెట్టి, అతడ్ని ప్రశ్నించారు. అనంతరం తేజను పంపించినట్టుగా తెలిసింది. ఈ కేసుని తాము అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని.. అరుణకుమారి ఆత్మహత్యకు తేజతో ఉన్న సాన్నిహిత్యమే కారణమా? లేక మరే ఇతర కారణాలున్నాయా? తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!