కాసేపట్లో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు పలు ఇతర అంశాలపైనా ఇద్దరు సీఎంలు దృష్టి సారిస్తారు. ఇద్దరూ సీఎంలు అయ్యాక తొలిసారి భేటీ కానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై పలువురు నేతలు ఆసక్తికర ట్వీట్లు చేశారు.
తెలంగాణ లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్ లో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవం కోసం జరిగిన స్వాభిమాన పోరాటం.. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ పోరాడిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.