ఈనెల 27 రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో జరిగే రైతు సభలో అమిత షా మాట్లాడుతారు అని ఆయన పేర్కొన్నారు. రైతు ఘోషా, బీజేపీ బరోసా పేరుతో ఖమ్మంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో రైతులకు మేలు జరగడం లేదు.. కనీసం ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైన అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు భీమా అందడం లేదు.. ప్రభుత్వ నిర్లక్షం వల్ల లక్షల కోట్లు నష్టపోతున్నారు.. ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ రైతులను మోసం చేశారు.. కేసీఆర్ మరో సారి రైతులను మోసం చేసేందుకు ప్రయతం చేస్తున్నారు అని ఆయన వెల్లడించారు.
Read Also: Chandrayaan-3: ఏం చేసినా ఈ 14 రోజుల్లోనే.. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఏమవుతాయి?
రైతు రుణాలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాలను కేసీఆర్ చేస్తున్నాడు.. రైతులు అసంతృప్తితో ఉన్నారు.. దేశంలో అనేక రాష్ట్రంలో సబ్సిడీ పద్దతి కొనసాగుతోంది.. ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం 26 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.. లక్షలాది మంది కౌలు రైతులు నష్టపోతున్నారు.. రైతు సమస్యలపై ఖమ్మంలో రైతు సభ ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సభలో అమిత్ షా రైతులను ఉద్దేశించి మాట్లాడుతారు.. అమిత్ షా డిల్లీ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి భద్రాచలం వచ్చి రాములోరిని దర్శించుకొని ఖమ్మం వస్తారు అని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: Indraja: ఇంద్రజ కూతురును చూశారా.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ కానీ… ?
బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయబోతున్నామో స్పష్టమైన క్లారిటీ ఇవ్వబోతున్నామని కిషన్ రెడ్డి అన్నారు. చంద్రయాన్-3 విజయంతో దేశం గర్వపడింది.. జాతీయ ఆవార్డులలో తెలుగు సినిమాలకు అవార్డులు రావడం హర్షం వ్యక్తం చేస్తున్నా .. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ కు అభినందనలు.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.. అంతర్జాతీయంగా డబ్బింగ్ చేయబడి ప్రజాదరణ పొందిన సినిమా పుష్ప.. ఈ చిత్ర యూనిట్ కు హృదయపూర్వక అభినందనలను ఆయన తెలిపారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుతో పాటు జాతీయ చలన చిత్ర అవార్డులతో సత్తా చాటింది.. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు అభినందనలు.. ఉత్తమ స్టంట్, ఉత్తమ డ్యాన్స్ కొరియో గ్రాఫర్ లకు అవార్డులు రావడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు.
Read Also: 69th National Film Awards: జాతీయ సినిమా అవార్డులు.. అల్లు అర్జున్ సహా ఎవ్వరినీ వదలని పవన్..
కేసీఆర్ కుటుంబం నేల విడిచి సాము చేస్తోంది అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. కుటుంబ రాజకీయాలకు పాల్పాడుతోంది.. మహిళా రిజర్వేషన్ పై కేసీఆర్ కుటుంబానికి మాట్లాడే నైతిక హక్కు లేదు.. మొదట కేసీఆర్ పాలనలో మహిళలు లేకుండా పరిపాలన చేశారు.. మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెడితే అడ్డుకున్న నేతలను కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలుచుకోని వింధులు ఏర్పాటు చేశాడు.. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులతో ఏడు మంది మహిళకు స్థానం కల్పించి రిజర్వేషన్ గురించి మాట్లాడుతారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న ఆడ బిడ్డలను అన్యాయం, అవమానించే విధంగా కేసీఆర్ పాలన ఉంది.. 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఏడు మంది మహిళలకు మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటే… ఎవరికి ఓటేసిన ఒకటేనని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.