NTV Telugu Site icon

Kishan Reddy: సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎం అంటున్న ఇద్దరినీ ఓడించిన ఘనత బీజేపీదే

Kishanreddy

Kishanreddy

గత ఎన్నికల తో పోలిస్తే కాంగ్రెస్ కు పెరిగిన ఓట్ల కన్నా ఎక్కువ శాతం ఓట్లు బీజేపీ పొందింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఫలితాలను సమీక్షించుకుని.. మంచి పలితాలు సాధించేందుకు కృషి చేయబోతున్నామన్నారు. కార్యకర్తలు నిరాశ నిస్పృహలు లోనూ కాకుండా ముందుకు వెళ్ళాలని కోతుకుంటున్నారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డబ్బు మద్యాని ఎదుర్కొని కార్యకర్తలు పార్టీ కోసం పని చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది.. కాంగ్రెస్ కి తెలంగాణలో అలాంటి ఫలితాలు రాలేదు అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.

Read Also: Chennai Rains: చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు..

అయినా.. ఒక సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎం అంటున్న ఇద్దరినీ ఓడించిన ఘనత బీజేపీ దే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డినీ ఓడించిన వెంకట రమణ రెడ్డి విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు అని ఆయన పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గెలువబోతున్నారు.. కేంద్రంలో హ్యాట్రిక్ ప్రధాని కాబోతున్నారు అంటూ వ్యాఖ్యనించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకే వేస్తామని ప్రజలు మాకు చెప్పారు.. మోడీకే మా ఓటు అని స్పష్టం చేశారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటర్లు సైతం లోక్ సభ ఎన్నికల్లో మాకు ఓటు వేస్తామని చెప్పారు అని కిషన్ రెడ్డి వెల్లడించారు.