NTV Telugu Site icon

Kishan Reddy : రేవంత్‌ రెడ్డి బుల్డోజర్లకు భయపడేవారు ఎవరూ లేరు

Bjp Basti Nidra

Bjp Basti Nidra

Kishan Reddy : మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులయ్యే నిర్వాసితులకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ మూసీ నిద్రలో భాగంగా కిషన్‌ రెడ్డి అంబర్‌పేట గోల్నాకలోని తులసీరామ్‌ నగర్‌కు చేరుకొని బస్తీవాసులు, బాధితులను కలిశారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బుల్డోజర్లకి భయపడే వారు ఎవరు లేరని, పేద ప్రజల జోలికి రానంటే మూడు నెలలు ఇక్కడే బస చేసేందుకు సిద్ధమన్నారు కిషన్‌ రెడ్డి. పేదల ఇల్లు కూల్చకుండా రిటైనింగ్ వాల్ కట్టి ప్రక్షాళన చేయొచ్చు అని ఆయన అన్నారు. మూసీపై బీజేపీ నాలుగు నెలలుగా పోరాటం చేస్తోందని, ఇప్పటికే బాధితులతో మేము ధర్నా నిర్వహించామన్నారు కిషన్‌ రెడ్డి. నేడు బాధిత ప్రాంతాల్లో వారితో కలిసి నిద్ర పోతామని, సీఎం ప్రకటనలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు కిషన్‌ రెడ్డి. ఎప్పుడు బుల్డోజర్ తో ఇల్లు కొలగొడతారో అనే భయం లో ప్రజలు ఉన్నారని, ప్రజలకు భరోసా కల్పించేందుకు బీజేపీ అనేక బస్తీల్లో రాత్రి బస చేస్తోందన్నారు కిషన్‌ రెడ్డి.

UP: ఝాన్సీ ఆసుపత్రి అగ్నిప్రమాదంపై విచారణ.. కమిటీ ఏర్పాటు

అంతేకాకుండా..’మూసీ బాధితుల బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. కాంగ్రెస్ మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్ర. మూపీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ? నిధులు ఎక్కడి నుంచి తెస్తారు ? ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో…ప్రజలకు , అధికారులకు తెలియదు …కానీ ఇల్లు కులగొడుతున్నారు. నల్లగొండ కు నీళ్ళు ఇవ్వడాన్ని మేం వ్యతిరేకం కాదు. నల్లగొండ రైతులకు బీజేపీ అండగా ఉంటుంది. పేదల ఇల్లు కూల్చితే మూసీ ప్రక్షాళన జరగదు. కంపెనీల కాలుష్యం రాకుండా అడ్డుకోవాలి. రివర్ బెడ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు… కాలుష్యం కాకుండా ఏం చేయాలో తెలియదు.. కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ? ఏ విషయంలోనూ సీఎంకు క్లారిటీ లేదు. మూసీ సుందరీకరణ చేయాలి. మూసీ రిటైనింగ్ వాల్ కట్టండి. పేదల ఇల్లు కూల్చకుండా చేయాలి. లక్షా యాభై వేల కోట్లకు అదనంగా నా జీతం ఇస్తా… అవసరం అయితే ఇంటింటికీ చందాలు వసూలు చేసి ఇస్తాం. నిజాం కు భయపడలేదు.. నీకు భయపడతామా రేవంత్ రెడ్డి. బుల్డోజర్ కు భయపడం. సంతోషంగా ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్తానంటే అడ్డుకోము. లక్షా బుల్డోజర్లు పెట్టిన ఇక్కడ ఇల్లు కూలగొట్టలేము. ఒక కేంద్ర మంత్రిగా.. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెబుతున్నా.. ఇల్లు కూల్చే కార్యక్రమాన్ని విరమించుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నా.

SSC Exam Fee : పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

వారం రోజులు ఇళ్ళల్లో పనిచేస్తే ఎంత జీతం వస్తుందో అంత మొత్తం మూసీ ప్రక్షాళనకు పేదలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాష పద్ధతిగా లేదు. మూసీ పక్కన మట్టి పోస్తూ అక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేశారు. మాకు పేద ప్రజలను రెచ్చగొట్టాలని లేదు. ముఖ్యమంత్రిని విమర్శించాలని లేదు. రాజకీయంగా చూడవద్దు.. ప్రజల తరఫున.. ప్రజల కోసం . ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇది. ప్రజలు చేస్తున్న కార్యక్రమంలో బీజేపీ పాల్గొన్నది. ఎంత మందిని జైల్లో వేస్తావో.. ఎంత మందిని తొక్కిస్తావో చూద్దాం. ప్రతి అడ్డమైనవాడు విమర్శలు చేస్తున్నారు.. ప్రజల కోసం భరిస్తాం.. ఇల్లు కూలగొట్టకుండ ప్రక్షాళనను మేం స్వాగతిస్తాం.. పేద ప్రజల మీద కక్ష కట్టినట్లు వ్యవహరించవద్దు..’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.