NTV Telugu Site icon

Kishan Reddy : గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చింది

Kishanreddy

Kishanreddy

Kishan Reddy : నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి  తెలంగాణ ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చిందన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందని ఆయన అన్నారు.  ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, బీజేపీకి మీరు అందించిన మద్దతు వల్ల మోదీ 3.0 ప్రభుత్వంలో తెలంగాణ మెరుగైన భాగస్వామ్యం పొందిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలయినటువంటి మొత్తం ఓట్లలో 77,43,947 ఓట్లను సొంతం చేసుకున్న బీజేపీ, 36 శాతం ఓట్లతో తెలంగాణవ్యాప్తంగా గణనీయమైన ప్రభావం చూపిందని కిషన్ రెడ్డి తెలిపారు.

karavali Teaser: భయపెడుతున్న ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ టీజర్

అంతేకాకుండా..’బీజేపీని తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నరేంద్రమోడీ సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యాలకు తోడు రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ, బాధితులకు భరోసానిస్తూ, బీజేపీ ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. బీజేపీ పట్ల మీరు చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలు 2025 లోనూ కొనసాగుతాయని ఆశిస్తున్నాను. 2025 లో ప్రజలందరికీ మంచి చేకూరాలని, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… నరేంద్రమోడీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని మనవి చేసుకుంటూ… ప్రజలందరికీ మరోమారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Boy Kidnap : ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్‌.. అమ్మేసి.. సొమ్ము చేసుకున్న వైనం

Show comments