Site icon NTV Telugu

Kisan Reddy : మోడీ వచ్చాక ఐఎస్ఐ దాడులు లేవు, మత కల్లోల్లాలు లేవు : కిషన్ రెడ్డి

New Project 2024 04 13t114600.032

New Project 2024 04 13t114600.032

Kisan Reddy : పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కమలం పార్టీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 400 ప్లస్ సీట్లు టార్గెట్‌గా పెట్టుకోగా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలవాలని భావిస్తోంది. అందుకుగాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. వరుసగా ఖైరతాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి కిషన్ రెడ్డి ప్రచార యాత్ర ప్రారంభమైంది. ఎన్బీటీ నగర్ లో కార్నర్ మీటింగ్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. దేశం కోసం, మన భవిష్యత్తు కోసం, మన రక్షణ కోసం ఓటెయ్యాలన్నారు. దేశం కోసం, మన కోసం సమర్థవంతంగా మోడీ పని చేస్తున్నాడని.. ఆయన వచ్చిన తర్వాత ఐఎస్ఐ దాడులు లేవు, మత కల్లోల్లాలు లేవన్నారు. భారత దేశంలో డాక్టర్లు తక్కువ కరోనా వస్తే అందరూ చనిపోతారని అన్నారు. కనిపించని మృత్యువు కరోనా మందును కనుగొన్నాం మనం.. కరోనా వ్యాక్సిన్ ఇచ్చి మన అందరి ప్రాణాలు కాపాడాడు మోడీ. కరోనా వచ్చినప్పుడు లాక్ డౌన్ ఉంటే ఆకలితో ఉండొద్దు అని ఉచిత రేషన్ బియ్యం ఇచ్చాడని తెలిపారు.

Read Also:Manchu Lakshmi: మంచు లక్ష్మి కొత్త ఇంటిని చూశారా?.. అదిరిపోయింది అంతే..

కరోనా పోయిన కూడా మరో ఐదేళ్లు ఉచిత రేషన్ ఇవ్వాలని చెప్పాడు. పేదలకు ఐదులక్షల రూపాయలు వైద్యం కోసం ప్రధాని ఇస్తున్నారు. హైదరాబాద్ లో గతంలో ISI దాడులు జరిగేవి. మత కల్లోల్లాలు, కర్ఫూలు ఉండేవి. ఇప్పుడు అవి మచ్చుక కూడా లేవు. అందరిని ఒప్పించి, మెప్పించి రాముడి గుడి కట్టాడు మోడీ.. ఆయన లేకపోతే కరోనా పెద్దది అయ్యేది.. పాకిస్థాన్ ఉగ్రవాదం తగ్గేది కాదన్నారు. తెలంగాణను తండ్రి, బిడ్డ, కొడుకు దోచుకున్నారు. తెలంగాణలో దోచుకున్నది సరిపోక ఢిల్లీలో లిక్కర్ బీర్ వ్యాపారం చేసి జైలుకు పోయింది. అధికారం పోయిన అహంకారం తగ్గలేదు.. జనాలకు బుద్ధి లేక ఒడగొట్టారని అంటున్నారు. కాంగ్రెస్ వచ్చిన వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని అన్నది. ఇంకా ఎటువంటి హామీ అమలు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్స్, దోచుకోవడం.. స్వాత్యంత్రం వచ్చిన తరువాత తొలి బీసీ ప్రధాని మోడీ. ఓటేసి గెలిపించాలని కోరుతున్నట్లు కిషన్ రెడ్డి కోరారు.

Read Also:Patanjali Honey : తేనె నమూనా పరీక్షలో విఫలమైన పతాంజలి.. రూ.లక్ష జరిమానా

Exit mobile version