NTV Telugu Site icon

Kishan Reddy: రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలి..

Kishan Reddy

Kishan Reddy

కేసీఆర్ కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లాకు అనేక హామీలు ఇచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు సమాధానం చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి.. మేమే పెడతామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారు కదా.. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదు.. మీ కుటుంబం కోసం మాత్రమే.. వరదల వల్ల నష్టపోయిన రైతులకు పది పైసలు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు అయిన తరువాత గిరిజనులపై ఉక్కు పాదం మోపుతున్నారు. దళిత బందు బీఆర్ఎస్ బంధుగా మారింది.. ఎమ్మెల్యేలు దళిత బంధులో కమిషన్ తీసుకుంటున్నారు.. గులాబీ నాయకులు మాఫియా మాదిరిగా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Read Also: Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి

పోలీసు అధికారులను తమ కనుసన్నల్లో పని చేసే విధంగా చేసుకున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ ప్రత్యర్ధులు మీద ఖమ్మం జిల్లాలో దాడులు చేశారు.. అక్రమాలను ప్రశ్నించే వారిని మంత్రి అజయ్ కుమార్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయన తెలిపారు. కమ్యునిస్టు పార్టీలో పుట్టిన వ్యక్తి ఎలా ఇంత సంపాదించాడు అని కిషన్ రెడ్డి అడిగారు. మంత్రి సొంత పార్టీ నేతలనే వేధిస్తున్నాడని ఆయన అన్నారు. ప్రజలను ఎక్కువ రోజులు మభ్య పెట్టలేరు..
మిమ్మల్ని ప్రజలు కూకటి వెళ్ళతో సహా పెకిలించి వేస్తారని కిషన్ రెడ్డి వెళ్లడించారు. రానున్న ఎన్నికలలో ప్రజల వ్యతిరేకతతో ఫలితం చూస్తారు.. ఈ నెల
27న ఖమ్మంలో నిర్వహించే సభకు అమిత్ షా వచ్చే అవకాశం వుంది అని కిషన్ రెడ్డి పేర్కొన్నాడు.

Read Also: Pawan Kalyan: విశాఖ రాజధానిపై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో ఒక్క కుటుంబ పాలన ఆధిపత్యం, అహంకారం పరిపాలన కొనసాగుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోవడం కాదు ప్రజాస్వామికమైన పరిపాలన రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్,బీఆర్ఎస్ లు కలిసి దేశంలో ఒకే మంత్రివర్గంలో ఉన్న విషయం తెలుసు.. భవిష్యత్ లో కూడా ఆ రెండు పార్టీలు కలుస్తాయి.. కాంగ్రెస్ అభ్యర్థికి కేసీఆర్ ఏ విధంగా కలిసి పని చేశారో మనకు తెలుసు.. కాంగ్రెస్ కూటమిలో మేము కీలక పాత్ర పోషిస్తాయని కేసీఆర్ కుటుంబ సభ్యుడు చెప్పింది నిజం కాదా అని కిషన్ రెడ్డి అడిగారు.

Read Also: Shriya Saran : తన కూతురితో కలిసి వెరైటీ డ్రెస్ లో పోజులిచ్చిన శ్రీయా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

కేసీఆర్ ప్రభుత్వం అవినీతి పాలన పోవాలి అని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు అని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కు నిజమైన ప్రత్యామ్నాయం ఎవ్వరో మీరే ఆలోచించాలి.. పార్లమెంట్ ఎన్నికల్లో లేదా ఎన్నికలు అయిన తరువాత ఒకే గూటిలోకి చేరతారు.. వారి ఐక్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి..
మాఫియా రాజ్యం పోవాలని అనుకుంటున్నాము.. ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటే.. రెండు పార్టీలు కలుస్తాయన్న విషయం మనకు తెలుసు అని కిషన్ రెడ్డి పేర్కొన్నాడు.

Read Also: Khudiram Bose: సినిమా రిలీజ్ చేయలేక ఆసుపత్రి పాలైన సినీ నిర్మాత

నరేంద్ర మోడీకి తెలంగాణలో అవకాశం ఇవ్వండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. నాలుగున్నర ఏళ్ల తరువాత ఎన్నికల ముందు రుణమాఫి చేయాలని కేసీఆర్ కు గుర్తుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తు తు మంత్రంగా రుణ మాఫీ చేశాడు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేవు.. అందని ద్రాక్ష పండు లాగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి.. కేంద్రంలో నాలుగుకోట్ల ఇళ్లు కట్టాము.. అసమర్థతతో పేద వాడికి అన్యాయం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది.. తెలంగాణలో పెదలకు ఇళ్లు రావాలంటే బీఆర్ఎస్ పోవాలి అని కిషన్ రెడ్డి అన్నారు.