శ్రీయా శరన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నీ స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా ఈ భామ స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ళ పాటు ఓ వెలుగు వెలిగింది.ఈ భామ టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.అక్కడ కూడా వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించింది.ప్రియుడు ఆండ్రీ కొఛీవ్ ను పెళ్లిచేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. ఈ భామ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీయా వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది.
అదేవిధంగా ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలను తన ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఉంటుంది.అలాగే తన ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ భామ వరుసగా గ్లామర్ ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతుంది.. 40 ఏళ్ళ వయసులో కూడా శ్రీయా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రియ తన కూతురితో కలిసి వెరైటీ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే ఆ ఫోటోలో శ్రియ ధరించిన దుస్తులను చూసి నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.. అసలు అవి బట్టలేనా చాలా దరిద్రంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక బిడ్డకు తల్లివి అయ్యి ఉండి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. ఆ ఫొటోస్ లో శ్రీయా చాలా లూజ్ గా ఉండే షర్ట్, లంగా మాదిరిగా ఉండే డ్రెస్ ను ధరించడంతో నెటిజన్స్ శ్రీయా పై నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.