జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో జరుగుతున్న అభివృద్ధి పనులను సందర్శించి అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో ఉపాధి హామీకి పనులకు 140 రూపాయలు ఇస్తుంటే తెలంగాణాలో మాత్రం 175 నుండి 180 రూపాయలు ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా… ఉపాధి హామీ పథకంతో దేశంలో తెలంగాణాకు నంబర్ వన్ అవార్డు దక్కిందని ఆయన వెల్లడించారు. పచ్చిమ బెంగాల్ మాదిరిగా తెలంగాణలో కూడా ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేవేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కాపాడుకుంటనే మన బ్రతుకులు మారుతాయని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం 2 కోట్ల ఉద్యోగులు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిందని, మోడీ జన్ ధన్ ఖాతాలో రైతులకు డబ్బులు వేస్తానని బోగస్ మాటలు మాట్లాడిండు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పరిపాలన రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.