Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు.. ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఉదయం నారాయణపేట సభలో మోడీ పాల్గొని ప్రసంగిస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సభలో మోడీ పాల్గొంటారని, తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు.. ఎన్నికల సందేశాన్ని ఇస్తారని ఆయన పేర్కొన్నారు. బట్టకాల్చి మొహం మీద పడేసే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నాయి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ మాటలు ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు.. నవ్వుకుంటున్నారని, గాడిద గుడ్డు ప్రచారం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అవుతుంది.. తెలంగాణ ప్రజలెవరూ దాన్ని పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
అంతేకాకుండా..’హైకమాండ్ ఆదేశాలతో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలను కలిసాం.. ఎన్ని తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేసిన నాకు ఢోకా లేదు.. అండర్ కరెంట్, ఓపెన్ కరెంట్ ఉంది.. ప్రజలు బీజేపీకె ఒకేస్తామని చెప్తున్నారు.. మాకు తెలంగాణకు ఇది కీలకమైన సభ.. 5 పార్లమెంట్ నియోజవర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ సభలో పాల్గొంటారు.. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు, యూత్ అందరు సభకు రావాలి.. మోడీకి మనమంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.. ఏ ఫ్రంట్ కూడా మోడీకి ప్రత్యామ్యయంగా లేదు.. కాంగ్రెస్ కు విమర్శించడానికి ఏం లేదు.. కాబట్టి దుష్ప్రచారాలు చేస్తుంది.. రిజర్వేషన్స్ అంశమపైన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసింది.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలను ఏ ఒక్కరు సీరియస్ గా తీసుకోవడం లేదు.. రిజర్వేషన్స్ అంశంపై డైరెక్ట్ చేసిన రాహుల్ గాంధీ సినిమా ఫ్లాప్ అయ్యింది.. సెకండ్, థర్డ్ ప్లేస్ వస్తుందని రేవంత్ రిజర్వేషన్స్ అంశాన్ని ప్రచారం చేస్తున్నారు.. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం..’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Tags
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు