మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మహారాష్ట్రలో బీఅర్ఎస్ బ్రాంచ్ పెట్టుకున్నారన్నారు. మహారాష్ట్రలో పనికి రాని వాళ్ళను జాయిన్ చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారని, తెలంగాణలో రైతులను, నిరుద్యోగులను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. పంటల బీమాను అమలు ఎందుకు చేయడం లేదని, మోడీ ప్రభుత్వం ప్రతి ఎకరాకు ఎరువుల పైన 18,254 సంవత్సరానికి సబ్సిడీ ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా.. ‘రైతులకు కేసీఆర్ ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పారు ఇంతవరకు ఇవ్వడం లేదు. ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారు రైతులను వెన్నుపోటు పొడిచారు.
Also Read : IPL 2023 : సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
కేసీఆర్ కు రైతుల పైన చిత్త శుద్ది లేదు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టు కోలేదు. తెలంగాణలో ప్రజలను మోసం చేసిన కేసీఆర్… మహారాష్ట్రకు వెళ్లి అభివృద్ధి చేస్తామని చెప్పడం… మోడీని విమర్శించడం విడ్డూరంగా ఉంది. మోడీ ప్రభుత్వం వచ్చాక రైతులకు మద్దతు ధర దాదాపు 100 శాతం పెంచాం. మూతపడ్డ ఏరువుల పరిశ్రమ లను తెరిపించాము. రాష్ట్ర ప్రభుత్వ రైతు బందు కంటే… కేంద్ర ప్రభుత్వ ఏరువు ల సబ్సిడీ చాలా బెటర్ గా ఉంది. కౌలు రైతులకు కూడా ఏ రువుల సబ్సిడీ ఇస్తున్నాం. కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని పొంకనలు కొడుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మేడ లో నుండి రాళ్లు వేస్తున్నారు… ఆ రాళ్లు మికే తగులుతాయి. దేశంలో జీ 20 సమావేశాలు 100 పైగా జరిగాయి. 46 అంశాల పైన 250 పైగా మీటింగ్ లు ఉంటాయి. టూరిజం కు సంబందించి శ్రీనగర్ లో రేపటి నుండి 3 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. 29 దేశాల నుండి ప్రతినిధుల బృందం హాజరవుతారు. హైదరాబాద్ లో జూన్ 15,16,17 తేదీలో వ్యవసాయ రంగం కు సంబంధించి జీ 20 సదస్సు జరగనుంది. 29 దేశాలకు సంబందించి ప్రతినిదులు హాజరవుతారు. దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి జరిగింది నిజమే. కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది, టీఅర్ ఎస్ ఎమ్మెల్యే లు అభివృద్ధి చెందారు, అవినీతి అభివృద్ధి చెందింది’ అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Also Read : PM Modi: ప్రధాని మోడీ కాళ్లకు నమస్కరించిన ఆ దేశ ప్రధాని.. సంప్రదాయాన్ని పక్కకు పెట్టి ఘనస్వాగతం
