Kishan Reddy : సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కాళేశ్వరం కట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కాళేశ్వరం కట్టాడని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌస్‌కే వస్తున్నాయన్నారు. దళితులని సీఎం చేస్తానని దళితులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. భద్రాద్రి రాములోరి కల్యాణానికి కేసీఆర్ రారు.. మజ్లీస్ దావత్ లకు మాత్రం వెళ్తారన్నారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల జనాలు, అమరవీరులు వదిలిన బాణం ఈటల రాజేందర్ అని ఆయన వ్యాఖ్యానించారు. మీ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలను కలవడని, ఈటల రాజేందర్ గజ్వేల్ కి రాగానే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయిండన్నారు కిషన్ రెడ్డి. కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఒడిపోతాడన్నారు.
Also Read : Puttur: ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్ దారుణ హత్య
Also Read
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ఎన్నో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈ రోజు ఓ కుటుంబం పాలైందని ఆరోపించారు. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటుందని.. భూములు, బిల్డింగ్లు కొనాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ అవినీతిమయం అయిందని, కల్వకుంట్ల కుటుంబంపాలైందని ఆరోపించారు. ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్ఎస్లోకి పోయారని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు. బీఆర్ఎస్తో బీజేపీ ఇప్పటి వరకు పొత్తు పెట్టుకోలేదని.. భవిష్యత్‌లో పెట్టుకోబోదని చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయని తెలిపారు.
తాజావార్తలు
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!