NTV Telugu Site icon

Kishan Reddy : తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యింది

Kishan Reddy Hot Comments

Kishan Reddy Hot Comments

సంగారెడ్డి జిల్లాలో నేడు బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యిందన్నారు. వచ్చే 89 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, తెలంగాణ ప్రజల కోసం పని చేసే నాయకులు కావాలా ఓ కుటుంబం కోసం పని చేసే నాయకులు కావాలా ఆలోచించండని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌కి వేస్తే కేసీఆర్ కుటుంబానికి ఓటు వేసినట్టు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కి ఓటేస్తే సోనియా గాంధీ కుటుంబానికి వేసినట్టు అని ఆయన అన్నారు. ప్రజల కోసం పని చేయాలంటే బీజేపీకి ఓటయ్యాలని, ఈ దేశంలో అత్యధిక ధనవంతమైన పార్టీ బీఆర్ఎస్‌ అని ఆయన అన్నారు. అవినీతికి కొమ్ముకాసే పార్టీలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. దేశంలో ఉన్న పార్టీల రాజకీయ ఖర్చులు నేను భరిస్తానని సీఎం కేసీఆర్ చెబుతున్నాడని ఆయన అన్నారు. ఈ డబ్బులన్ని ఎక్కడి నుంచి వచ్చాయి కేసీఆర్ అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Dil Raju: జవాన్ తో పాటు రిలీజైనా నిలదొక్కుకుంది.. ‘మిస్ శెట్టి’కి దిల్ రాజు ప్రశంసలు

అంతేకాకుండా.. ‘కేసీఆర్ సీఎం, కేటీఆర్‌ సీఎం అంటారు ఇదేమైనా నిజాం రాజ్యమా. కేసీఆర్ నయా నిజాం..మజ్లీస్ తో కలిసి దందా చేస్తున్నాడు. కేసీఆర్ కారులో కూర్చోవాలంటే ఆ స్టీరింగ్ మా చేతిలో ఉందని ఒవైసీ చెబుతున్నాడు. బీఆర్‌ఎస్‌కి ఓటేసిన కాంగ్రెస్ కి ఓటేసినట్టే..కాంగ్రెస్ కి ఓటేసిన అది బీఆర్‌ఎస్‌కి ఓటేసినట్టే. ఈ రెండు పార్టీలకు ఓటేస్తే మజ్లీస్ పార్టీకి ఓటేసినట్టే. ఈ మూడు పార్టీలు ఒక్కటే.. ఈ రెండు పార్టీల నాయకులు మజ్లీస్ పార్టీ ముందు జీ హుజూర్ అంటూ సలాం కొడుతారు. కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశాడు. ORR రోడ్డు 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చి జీతాలు ఇస్తున్నారు.

Also Read : Sana Mir: అచ్చం రష్మికలానే ఉంది.. ఈమే ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మద్యం షాపు టెండర్ల ద్వారా వచ్చిన డబ్బులతో ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. మరొక్కసారి కేసీఆర్ కి అధికారం ఇస్తే చిప్ప చేతికి ఇస్తాడు కేసీఆర్. మిగులు బడ్జెట్ తెలంగాణ ని అప్పుల మయంగా మార్చారు. కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ని కాపాడుకోవాలి. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థికి పిలిచి భోజనం పెడతారు కేసీఆర్. కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచినా మళ్ళీ బీఆర్‌ఎస్‌ లోకి పోతారు. రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. జనరంజకమైన పాలన అందిస్తాం.’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.