Site icon NTV Telugu

Kishan Reddy: ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే విధానాన్ని అవలంభిస్తున్నాయ్..

Kishanreddy

Kishanreddy

రోజు రోజుకు బీజేపీ పట్ల సానుకూలత పెరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ మద్దతు చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) విష ప్రచారాల్ని చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ మద్దతు పెరుగుతున్నట్టే.. బీజేపీ పైన కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) పార్టీల అసత్యపు ప్రచారాలు పెరిగాయన్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకే విధానాన్ని ఆ పార్టీలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

READ MORE: Jharkhand : జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎన్నికల వేదిక.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ ప్రజలు చైత్యనవంతులని వారి మాటలు నమ్మరని కిషన్ రెడ్డి అన్నారు. అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. అవినీతి పైన రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గ్యారంటీలు అమలు చేశామని సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. కాగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన ఈ సారి కూడా అదే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ప్రజల్లో పార్టీపై విశ్వాసం పెంచేందుకు పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించింది. ఈ సారి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version