రోజు రోజుకు బీజేపీ పట్ల సానుకూలత పెరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆల్లర్లలో సుబ్బారావు పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసరావుపేటకు తరలించి విచారణ అనంతరం నర్సరావుపేట టూటౌన్ పోలీస్…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం సిటీ పోలీసులు విచారణ చేపట్టారు. ” చలో సికింద్రాబాద్ “అనే వాట్సప్ గ్రూపు సభ్యులను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి నట్లు గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితమే వాట్స్అప్ గ్రూపులు క్రియేట్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హకీంపేట్ ఆర్మీ ర్యాలీ కి వచ్చినవారే విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు. ఆదిలాబాద్ నుంచి…