NTV Telugu Site icon

Kishan Reddy : నిజాం రాచరిక ఆలోచనలతో కేసీఆర్ పాలన చేస్తున్నారు..

Kishan Reddy On Kcr

Kishan Reddy On Kcr

నిజాం రాచరిక ఆలోచనలతో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్ ను ఆహ్వానించకపోవడం.. అడ్డుకోవడం.. కొంతమందిపై నిషేధం విధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇది విచారణకరమన్న కిషన్ రెడ్డి.. దీనిని తీవ్రంగా ఖండించాలన్నారు. పత్రికలు, ప్రసార సాధనాలకు ప్రభుత్వ విధానాలను విమర్శించే అధికారం ఉంటుందన్నారు. “విమర్శించారన్న నెపంతో గతంలో టీవీ9, V6, ఏబీఎన్ ఛానల్స్ ను నిషేధించారు.

Also Read : Bus Accident : ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌.. 40 మంది ప్రయాణికులకు గాయాలు

10 కి.మీ. లోతున భూమిలో పాతిపెడతానన్నారు. సీఎం అర్థం చేసుకోవాలి.. ప్రసార సాధనాల అండతోనే తెలంగాణ ఉద్యమం సాగింది. ప్రజల ఆందోళనలు అడ్డుకోవడం.. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ఎంత వరకు సమజం” అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2016 నుంచి సెక్రటేరియట్ కు రాకుండా పాలన సాగించారు. ప్రజల రావడానికి అవకాశం లేని ప్రగతి భవన్.. సీఎం రాని సచివాలయం ఎందుకని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. తొమ్మిదిన్నర ఏళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదన్న కిషన్ రెడ్డి.. 4 నెలల్లో సచివాలయం మాత్రం కట్టుకున్నారన్నారు.

Also Read : Mars: అంగారకుడిపై నీటి జాడలను గుర్తించిన చైనా రోవర్..

Show comments