NTV Telugu Site icon

Kishan Reddy : దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో ఉంది

Kishan Reddy

Kishan Reddy

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావాలని, అందుకు నేతలంతా శ్రమించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, బీఆర్ఎస్ పై పోరాటానికి హైకమాండ్ కూడా పలు గైడ్ లైన్స్ ఇచ్చిందన్నారు కిషన్‌ రెడ్డి. వరంగల్ లో ప్రధాని మోడీ సైతం బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడారని, వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది బీఆర్ఎస్ పై పోరాటానికే అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Opposition Meeting: ఈ నెల 17-18న బెంగళూర్ వేదిక విపక్షాల భేటీ.. ఖర్గే ఆహ్వానం..

కొన్ని టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలకు దిగుతున్నాయన్నారు. దీన్ని నేతలంతా ధీటుగా ఎదుర్కోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి చేసిందన్నారు కిషన్‌ రెడ్డి. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో ఉందని, వేల కోట్ల రూపాయలను బీఆర్‌‌ఎస్ పార్టీ దోచుకుందని ఆయన ఆరోపించారు. ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నారని, ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

Also Read : Godavari River : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల అద్దం పడుతున్న గోదావరి

కాంగ్రెస్, బీఆర్ఎస్ బొమ్మ బొడుసులాంటి పార్టీలు అని, ఎన్నికలకు ముందో, తర్వాతో ఈ రెండూ కలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ.. దొందే అని, ఎవరికి ఓటేసినా కుటుంబ పార్టీకే ఓటు పడినట్లవుతుందన్నారు. ఈ రెండు పార్టీలకు అవినీతి చరిత్ర ఉందని, ఈ రెండూ కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఈ పార్టీలను ప్రజల వద్ద దోషిగా నిలబెట్టాలని, అనేక మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు కిషన్‌ రెడ్డి. గ్రామస్థాయి నుంచి చేరికలు జరగాలన్నారు. వచ్చే మూడు నెలలు సమగ్రంగా ప్రణాళిక చేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కిషన్‌రెడ్డి.

Show comments