NTV Telugu Site icon

Kishan Reddy : ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశమే లేదు

Kishanreddy

Kishanreddy

కాశ్మీర్ లో వంద శాతం టార్గెట్ రిచ్ అయ్యామని, హర్యానాలో EVM టాంపరింగ్ జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదు? కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో EVM టాంపరింగ్ ఎందుకు జరగలేదన్నారు కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్‌ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూలో ఒక రకంగా ఓటర్ల పోలరైజ్.. కాశ్మీర్ లో మరోరకంగా పోలారైజ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రశాంతంగా అత్యధిక పోలింగ్ జరిగిన ఎన్నికల ఇవి అని, హర్యానా ఎగ్జిట్ పోల్స్ రాగానే మంత్రి వర్గ కూర్పు పై రాహుల్, సోనియా దగ్గర క్యూ కట్టారని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశమే లేదని కిషన్‌ రెడ్డి ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ మాట్లాడే ధైర్యం చేయడం లేదని, జమ్మూ కాశ్మీర్‌లో ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆ ఆరు మంది ముస్లింలే అని కిషన్‌ రెడ్డి అన్నారు. బీజేపీ నుంచి గెలిచిన 29 మంది హిందువులే అని 19 మంది కొత్తవాళ్ళు అని ఆయన అన్నారు. భద్రత విషయంలో కేంద్రప్రభుత్వ విధానంలో మార్పు లేదు జమ్మూలో టెర్రరిజంపై మరింత జాగ్రత్తగా ఉంటామని కిషన్ రెడ్డి అన్నారు.

Russia-Iran: రష్యా- ఇరాన్‌ అధ్యక్షుల భేటీ..! ఉత్కంఠ రేపుతున్న సమావేశం!

ఇకపోతే.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఆందోళనపై కిషన్‌ రెడ్డి స్పందిస్తూ.. ఇళ్ళను కూల గొట్టడం అంతా ఈజీ కాదని, అంత ధైర్యం లేదన్నారు. 30, 40 ఏళ్ల క్రితం నుండి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటున్నారన్నారు. స్వచ్ఛందంగా వెళ్లి పోతమంటే మాకేమీ అభ్యంతరం లేదని, డ్రైనేజ్ వ్యవస్థపై దృష్టి పెట్టకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యమన్నారు. ముందు ఇల్లు కూల్చుతా తర్వాత ప్లాన్ చేస్తా అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. రేపు ప్రాజెక్ట్ ఆగిపోతే… బాధితుడు ఎక్కడకు పోవాలని, తొందరపాటు, దుందుడుకుతో పోతే సక్సెస్ కారని ఆయన వ్యాఖ్యానించారు. దీని వెనుక రేవంత్ రెడ్డికి వేరే ఉద్దేశ్యం ఉందని, రేవంత్ రెడ్డి ప్రజల వద్దకు వస్తా అంటే నేను కూడా ప్రజల పక్షాన వచ్చి మాట్లాడతా అని ఆయన అన్నారు.

Stock market: మళ్లీ ఒడిదుడుకులు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

మా ఎంపీ ఎవరైనా పేద వాళ్ళ ఇల్లు కూల్చమని చెప్పారా అని, నేనే చెప్పేదే మా పార్టీ పాలసీ అన్నారు. ఇంతకు ముందు కూడా అక్రమ నిర్మాణాలను ప్రభుత్వాలు కూల్చాయని, హైడ్రా అనేది రేవంత్ రెడ్డి పెట్టుకున్న పేరు… అదేమీ బూతం కాదు కదా అన్నారు. ఎంజీబీఎస్, మెట్రో పిల్లర్లను కూల్చండి ముందు… పేదల ఇల్లే కనిపిస్తున్నాయా, బీఆర్‌ఎస్‌ సంబంధించి ఎవరు ఇప్పటి వరకు మాతో మాట్లాడలేదు, బీఆర్‌ఎస్‌తో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు అని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.