హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్ట్ అయిన బీజేపీ యువ మోర్చా నేతలతో ములాఖాత్ అయ్యారు. బీజేవైయం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో సహా అరెస్ట్ అయిన నేతలను కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యార్థులు, నిరోద్యోగులు ఆవేదన లో ఉన్నారని, అప్పులు చేసి మరీ చదివితే ఫలితం పొందే టైం లో పేపర్ లీకేజీ ఉక్రోషం లో ఉన్నారని, అక్రమాలు జరుగటం, ప్రశ్న పత్రలు లీక్ కావడం దుర్మార్గమన్నారు.
Also Read : YCP Leader KSN Raju: ఎమ్మెల్యే రాపాకను ప్రలోభ పెట్టిన మాట వాస్తవమే.. వైసీపీ లీడర్ క్లారిటీ
న్యాయమూర్తితో విచారణ జరపాలని ప్రజాసంఘాలు, మేము అందరమూ డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీలో తమ చేతకానితనం, అసమర్థత ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని, తెలంగాణలో అవినీతి విలయ తాండవం చేస్తుందన్నారు. యువతలో ఈ ప్రభుత్వము పై వ్యతిరేకత చాలా ఉందని, ఈ మాఫియా పాలన పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్షకు బిజెపి సమర్థిస్తోందని, కృష్ణ పుత్రుడా లీకేజీ నిరసనలో బిజెవైఎం నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే విధ్వంసం సృష్టిస్తున్నారని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేశారని , అవినీతి పాలన పోయేంతవరకు బీజేపీ పోరాటం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Atiq Ahmed: ప్రయాగ్‌రాజ్ జైలులోని హైసెక్యూరిటీ బ్యారక్‌కు అతిక్ అహ్మద్!