మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సింగరేణిపై స్పష్టత ఇవ్వాలంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఎన్నికలప్పుడే సింగరేణి కార్మికులు గుర్తుకు వస్తారని, 2014,18,19 ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ సొంత ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారన్నారు. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా విస్తరిస్తామని చెప్పిన కేసీఆర్ ఎందుకు చేయలేదో చెప్పాలని ఆయన అన్నారు. పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇంతవరకు పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులను పెద్దఎత్తున నియమించుకుంటు కార్మికుల శ్రమదోపిడికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతుందన్నారు కిషన్ రెడ్డి. అంతేకాకుండా.. ‘సింగరేణిని రక్షించాల్సింది పోయి భక్షించేలా కేసీఆర్ విధానాలున్నాయి.
Also Read : Karnataka Elections: ఎన్నికల్లో ధన ప్రవాహం.. రూ.200 కోట్ల నగదు స్వాధీనం
టీఎస్ జెనో నుంచి 2500 కోట్లు, టీఎస్ ట్రాన్కో నుంచి 18000 కోట్లు సింగరేణికి రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25000 కోట్లు రావాల్సి ఉంది. 3500 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సింగరేణిని ఇప్పుడు అప్పులు చేస్తేకాని జీతాలు ఇవ్వలేని స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారు. కోల్ ఇండియా అప్పు 12 వేల కోట్లు మాత్రమే. కోల్ ఇండియా అప్పులు రోజురోజుకు తగ్గుతుంటే బీఆర్ఎస్ చేతకానితనం, అంతర్గత అవినీతితో సింగరేణి అప్పులు పెరిగిపోతున్నాయి. సీఎం కుటుంబ సభ్యుల జోక్యం మితిమిరిపోయింది. అధికార దుర్వినియోగానికి సింగరేణి యాజమాన్యం రెడ్ కార్పెట్ వేసింది. ఎమ్మెల్యేలను సంతృప్తిపరచాలని సర్కులర్ జారిచేయడం. కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలన్న, తీసేయలన్న ఎమ్మెల్యేలు చెప్పినట్లే చేస్తున్నారు. కార్మికుల షిఫ్టులు మార్చలన్న అధికారపార్టీ నేతలు జోక్యం చేసుకోవడం దారుణం. సింగరేణిని బీఆర్ఎస్ జేబు సంస్థగా మార్చుకుంది. సింగరేణి ప్రయివేటికరణ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రయివేటికరణ చేసే ఆలోచనలేదంటూ ప్రధాని స్వయంగా చెప్పారు. ప్రధాని లిఖితపూర్వకంగా చెప్పిన బిఆర్ఎస్ కుట్రలు ఆపడం లేదు. బహిరంగ వేలల ద్వారానే బొగ్గు గనులను ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన మైనింగ్ కంపెనీలలో మైనింగ్ చేయడం చేతకాదు. సింగరేణి ప్రైవేటీకరణ లేదని ప్రధాని చెప్పారు. సింగరేణి పై కుట్రపూరిత ప్రచారాలు ఆగడం లేదు. బొగ్గుగనుల వేలంలో దేశం అంతా ఒకే విధానాన్ని కేంద్రం అమలు చేస్తుంది. రాష్ట్రాల పట్ల వివక్ష తేడాలను కేంద్రం అవలంభించడం లేదు.’ అని ఆయన అన్నారు.
Also Read : Mamata Banerjee: అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. అమిత్ షాకు మమతా బెనర్జీ సవాల్
