NTV Telugu Site icon

Kishan Reddy : ఈ నెల 20 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు

Kishanreddy

Kishanreddy

ఈ నెల 20 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పోస్టర్‌ను అవిస్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి దేశ వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో సానుకూల వాతావరణం ఉందన్నారు. ప్రజలు నరేంద్ర మోడీకి కమలం పువ్వుకే ఓటేసెందుకు ముందే నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ లో బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నామన్నారు. తెలంగాణ ప్రజల మద్దతు, ఆశీస్సుల కోసం 5 యాత్రలు నిర్వహించాలని …ఫిబ్రవరి 20 నుండి మార్చి ఒకటి వరకు యాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 5 పార్లమెంట్ క్లస్టర్ లలో 5 విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాత్రలకు క్లస్టర్ వారీగా పేర్లు పెట్టినట్లు, భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్ర కి భాగ్యనగరం అని పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. కరీంనగర్ , మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని, అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని పేరును నిర్ణయించినట్లు వెల్లడించారు.

వీటితో పాటు మహబూబ్ నగర్, నాగర కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కృష్ణమ్మ అని, ఖమ్మం, వరంగల్, మహబూబ్ బాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్ర కాకతీయ అని పేర్లను పెట్టారు. ప్రతి రోజు 2, 3 అసెంబ్లీ లని ఒక్కో యాత్ర కవర్ చేస్తుందని, ముఖ్య నేతలు అందరూ అన్ని యాత్రల్లో పాల్గొంటారన్నారు. ఈ యాత్రల సందర్భంగా ఎక్కువ రోడ్ షో లు ఉంటాయన్నారు కిషన్‌ రెడ్డి. అన్ని యాత్రలు హైదరాబాద్ లో ముగిసే విధంగా ప్లాన్ చేస్తున్నామని, హైదరాబాద్ పార్లమెంట్ లో గెలిచేందుకు పోటీ చేస్తాం… ఎంఐఎంను మట్టి కరిపిస్తామన్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ కి కాంగ్రెస్ పోటీ కాదని, తెలంగాణ లో బిజెపికి పోటీ కాంగ్రెస్ అని భావిస్తున్నామన్నారు. ఖమ్మం, నల్గొండ లలో కూడా బీజేపీ కి సానుకూల వాతావరణం ఉందని, కుటుంబ, అవినీతి పార్టీలకి …నీతి కోసం ధర్మం కోసం పని చేస్తున్న బీజేపీ కి మధ్య పోటీ అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘ఈ ఎన్నికలు దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం. సుస్థిరతకు అస్థిరత కు మధ్య జరుగుతున్న ఎన్నికలు.. రేపు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ, రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ లు ఉన్నాయి.
మేడిగడ్డ కు మేము ఇంతకు ముందే వెళ్లి వచ్చాము. వాళ్లతో వెళ్లాల్సిన అవసరం లేదు. Krmb పై ap, తెలంగాణ కూర్చొని మాట్లాడుకోవాలి. మా స్టాండ్ ఏందో అసెంబ్లీ లో, అసెంబ్లీ బయట చెబుతాం.’ అని కిషన్‌ రెడ్డి అన్నారు.