KIshan Reddy : అటవీ అనుమతుల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం.. అటవీ అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సింగరేణి సంస్థకు కేటాయించిన ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అటవీ అనుమతుల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైంది. 2015లోనే సింగరేణికి ఈ నైని బ్లాక్ కేటాయింపు జరిగినప్పటికీ.. వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఉత్పత్తి సాధ్యం కాలేదన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నైని బ్లాక్‌కు సంబంధించి ఒడిశా ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను. ఈ నేపథ్యంలో నైని బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన అవసరం, సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు విడుదల చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఒడిశా ముఖ్య మంత్రి శ్రీ మోహన్ మాంఝీ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నానని, ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వేగవతంగా నిర్ణయం తీసుకోవడంపై సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నానన్నారు. నైని బ్లాక్ లో సింగరేణి ఉత్పత్తిని ప్రారంభించిన తర్వాత.. తెలంగాణలో పవర్ సెక్యూరిటీకి (విద్యుత్ భద్రత) మరింత ఊతం లభిస్తుందనే విశ్వాసం నాకుందన్నారు కిషన్ రెడ్డి.
Also Read
- Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
- WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
- Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
- 200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
తాజావార్తలు
-
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
-
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
ట్రెండింగ్
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!